సౌత్ ఆఫ్రికా టూర్ ఆఫ్ ఇండియా 2022లో భాగంగా జరిగిన మొదటి టీ20లో టీమిండియాకి ఘోర పరాభవం తప్పలేదు. స్కోరు బోర్డులో 211 పరుగులు నమోదు చేసినా కూడా.. వాటిని కాపాడుకోవడంలో టీమిండియా ఘోరంగా విఫలమైంది. అద్భుతంగా రాణించిన ఇషాన్ కిషన్(76) ఇన్నింగ్స్ వృథా అయ్యింది. బ్యాటర్లు తమ కర్తవ్యం నివర్తించినా కూడా.. బౌలర్లు చేతులెత్తేయడంతో సఫారీలు 7 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేశారు. డేవిడ్ మిల్లర్(64*), రస్సీ వాన్ డెర్ డుస్సెన్(75*) చెలరేగడంతో సౌత్ ఆఫ్రికా ఓటమి అంచుల నుంచి విజయతీరాలు చేరుకుంది.
మ్యాచ్ ఫలితాన్ని పక్కన పెడితే ప్రస్తుతం సోషల్ మీడియాలో అవేశ్ ఖాన్ పేరు మారుమ్రోగుతోంది. ఎందుకంటే మనోడు వేసిన బంతికి రస్సీ బ్యాట్ రెండు ముక్కలు అయ్యింది. ఇప్పుడు ఆ వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అవేశ్ ఖాన్ అంత ఆవేశం ఏంటయ్యా అంటూ అభిమానులు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.
Artist -Avesh Khan#INDvSA #Cricket pic.twitter.com/CI5LCVnEmG
— Nur Hasan (@Nh_nurhasan) June 9, 2022
14 ఓవర్ వేసేందుకు అవేశ్ ఖాన్ బాల్ తీసుకున్నాడు. స్ట్రైకింగ్ లో డుస్సెన్ ఉన్నాడు. మొదటి బాల్ వైడ్, తర్వాతి రెండు బంతులు డాట్ బాల్స్ వేశాడు. ఆ తర్వాత మూడో బంతి యార్కర్ వేయగా డుస్సెన్ దానిని బలంగా స్ట్రైక్ చేశాడు. అవేశ్ ఖాన్ వేసిన వేగానికి డుస్సెన్ బ్యాటు బాటమ్ టూ టాప్ మిడిల్ నుంచి రెండు ముక్కలు అయ్యింది. తర్వాత డుస్సెన్ ఆ బ్యాటును మార్చుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వైరల్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Avesh Khan brokes the bat of Rassie van der Dussen with a searing yorker! 😱
📸: BCCI#AveshKhan #INDvsSA #TeamIndia #SouthAfrica #Cricket pic.twitter.com/x1ME2MsU4m
— SportsTiger (@sportstigerapp) June 9, 2022