WTC ఫైనల్ 2023: అస్ట్రేలియా ఫేవరేట్ అయినా.. ఆ రెండు విషయాల్లో మాత్రం టెన్షన్

సాధారణంగా ఇంగ్లాండ్ పిచ్ లు స్వింగ్ కి అనుకూలిస్తాయి. పైగా ఈ పిచ్ ల మీద భారత తో పోల్చుకుంటే ఆస్ట్రేలియాకి ఎక్కవ అనుభవంతో పాటు అవగాహన ఉంది. దీంతో ఈ ఫైనల్లో ఆస్ట్రేలియానే ఫేవరేట్ గా అందరు భావించారు. ఇదిలా ఉండగా ఈ ఫైనల్ కి ముందు ఆస్ట్రేలియాకి రెండు విషయాలు కంగారెత్తిస్తున్నాయి.

భారత్- ఆస్ట్రేలియా మధ్య ఎంతో ప్రతిష్టాత్మకమైన వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మరో రెండు రోజుల్లో జరుగనున్న సంగతి తెలిసిందే. లండన్ లోని ఓవల్ మైదానం ఈ మ్యాచ్ కి ఆతిధ్యమివ్వనుంది. భారత్ కాలమాన ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 నిమిషాలకి జరుగనుంది. స్టార్ స్పోర్ట్స్, డీడీ స్పోర్ట్స్ లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. ప్రస్తుతం ఈ ఫైనల్ మ్యాచ్ కోసం ఇరు జట్లు నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి. భారత్ కి ఈ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ వరుసగా రెండోది కాగా.. ఆసీస్ కి మాత్రం ఇదే తొలిసారి. ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఈ ట్రోఫీ సాధించని రెండు జట్లు ఈ మ్యాచులో ఎవరు గెలిచినా క్రికెట్ చరిత్రలో అన్ని ఐసీసీ టైటిల్స్ నెగ్గిన జట్టుగా అవతరిస్తుంది. ఇదిలా ఉండగా ఈ టెస్టు మ్యాచ్ కోసం ఆస్ట్రేలియాకి రెండు విషయాలు కంగారెత్తిస్తున్నాయి.

సాధారణంగా ఇంగ్లాండ్ పిచ్ లు స్వింగ్ కి అనుకూలిస్తాయి. పైగా ఈ పిచ్ ల మీద భారత తో పోల్చుకుంటే ఆస్ట్రేలియాకి ఎక్కవ అనుభవంతో పాటు అవగాహన ఉంది. దీంతో ఈ ఫైనల్లో ఆస్ట్రేలియానే ఫేవరేట్ గా అందరు భావించారు. దీనికి తోడు టీమిండియా మొన్నటివరకు ఐపీఎల్ ఆడి.. సడన్ గా టెస్టు మ్యాచ్ అంటే సవాలుతో కూడుకున్నదే. అయితే ఈ మ్యాచ్ కి ముందు ఆసీస్ ని ఒక రెండు విషయాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఒకటి చివరి నాలుగు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలు ఆస్ట్రేలియా మీద భారత్ నెగ్గడం. టెస్టుల్లో ఆస్ట్రేలియా చాలా స్ట్రాంగ్ టీం. ఇక సొంతగడ్డపై ప్రత్యర్థుల్ని కంగారెత్తుస్తుంది. కానీ భారత్ మాత్రం ఆస్ట్రేలియాకి ఆ అవకాశం ఇవ్వడం లేదు. సిరీస్ ఎక్కడ జరిగినా.. ట్రోఫీ ఎగరేసుకుపోతుంది. వరుసగా రెండు సార్లు ఆసీస్ గడ్డ మీద బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నెగ్గింది.

ఇక రెండో విషయం ఆసీస్ కి ఓవల్ లో చెత్త రికార్డ్ ఉండడం. ఇంగ్లాండ్ లో కంగారూల టీంకి మెరుగైన రికార్డ్ ఉన్నా.. ఓవల్ మాత్రం ఘోరమైన ప్రదర్శన చేస్తుంది. ఇక చివరి 50 ఏళ్లలో ఈ మైదానంలో ఆసీస్ జట్టు కేవలం రెండు మ్యాచులు మాత్రమే గెలిచింది. అంతేకాదు పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా మారితే మాత్రం ఆసీస్ కి జడేజా, అశ్విన్ రూపంలో ప్రమాదం తప్పదు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాని అందరూ ఫేవరేట్ గా భావిస్తున్నా.. గెలవాలంటే మాత్రం ఈ మూడు రికార్డులకు బ్రేక్ వెయ్యాల్సిందే. మరోవైపుకు భారత్ కి కూడా పటిష్టమైన ఆసీస్ తో ఈ ఫైనల్ నెగ్గడం అంత సామాన్యమైన విషయం కాదు. ఈ నేపథ్యంలో రెండు జట్ల మధ్య హోరా హోరీ పోరు ఖాయంగా కనిపిస్తుంది. మరి మొత్తానికి ఈ ఫైనల్ ఎవరు గెలుస్తారో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Most viewed