ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, మాజీ వికెట్ కీపర్ రాడ్ మార్ష్ కన్నుమూశారు. ఆసీస్ తరఫున టెస్టుల్లో తొలి సెంచరీ చేసిన వికెట్ కీపర్‌గా రికార్డుల్లోకెక్కిన మార్ష్(74) నేడు(మార్చి 4) గుండెపోటుతో మరణించారు. గతవారం ఓ చారిటీ మ్యాచ్ సందర్భంగా హాజరైన మార్ష్‌కు గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వారం రోజుల పాటు చికిత్స పొందిన రాడ్ మార్ష్ నేడు ఉదయం తుది శ్వాస విడిచారు. దీంతో మార్ష్ మృతి పట్ల క్రికెట్ ప్రపంచం సంతాపం తెలుపుతోంది. అనేక మంది ఆటగాళ్లు మార్ష్ మృతికి నివాళులు అర్పిస్తున్నారు.
ఆస్ట్రేలియా తరఫున 1970లోఅరంగ్రేటంచేసిన మార్ష్.. 1984లో రిటైర్ అయ్యారు. ఆస్ట్రేలియా తరపున టెస్టుల్లో తొలి సెంచరీ సాధించిన వికెట్‌కీపర్ గానూ గుర్తింపు పొందారు. ప్రపంచంలోని అత్యుత్తమ వికెట్ కీపర్‌లో మార్ష్ ఒకరు. 1970 నుంచి 1984 మధ్య కాలంలో అంటే 15 సంవత్సరాలపాటు అంతర్జాతీయ క్రికెట్‌లో మార్ష్ ఆడారు. రిటైర్‌మెంట్ అనంతరం.. క్రెకెట్‌తో తన అనుబంధాన్ని కొనసాగించారు . ఆస్ట్రేలియా క్రికెట్ అకాడమీ చీఫ్‌గా రికీపాంటింగ్, జస్టిన్ లాంగర్ వంటి డజన్ల కొద్ది టెస్ట్ ప్లేయర్లను సీనియర్ జట్టుకు అందించారు. సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా సుదీర్ఘకాలం పనిచేశారు.రాడ్ మార్ష్ 1985లో స్పోర్ట్ ఆస్ట్రేలియా హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటుదక్కించుకున్నారు. మార్ష్‌తో తనకున్న అనుబంధాన్ని జట్టు మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ గుర్తుచేసుకున్నారు. వికెట్ కీపర్‌గా మార్ష్ తన టెస్టు కెరీర్లో 355 మందిని ఔట్ చేశాడు. ఆయన రిటైర్ అయ్యే సమయానికి అత్యధిక మందిని ఔట్ చేసిన వికెట్ కీపర్ల రికార్డు మార్ష్ పేరు మీదనే ఉన్నది. మొత్తంగా 92 టెస్టు మ్యాచ్‌ల్లో మార్ష్ బ్యాటర్‌గా 3633 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 16 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మార్ష్ అత్యధిక స్కోర్ 132 పరుగులు. ఇక 92 వన్డే మ్యాచ్‌ల్లో 20 సగటుతో 1225 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్ధ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో మార్ష్ అత్యధిక స్కోర్ 66 పరుగులు.
We are deeply saddened by the passing of Rod Marsh.
A brilliant wicketkeeper and hard-hitting batter, Rod’s contribution to Australian cricket was outstanding and he will be truly missed.
Our thoughts are with his wife Ros, children Paul, Dan and Jamie and his many friends. pic.twitter.com/DXR0rEyZjx
— Cricket Australia (@CricketAus) March 4, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.