ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ఫాస్ట్ బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఒకడు. బంతిని సంధించడంలో అతనిది ఓ ప్రత్యేకమైన స్టైల్. శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగా డిఫరెంట్ యాంగిల్ లో బాల్స్ వేయడంలో ఎలా ఫేమస్ అయ్యాడో.. బుమ్రా కూడా అంతే. అయితే,. మనకు తెలిసిన బుమ్రా కుడిచేతి వాటం బౌలర్. అతను గనక ఎడమ చేత్తో బౌలింగ్ చేస్తే ఎలా ఉంటుంది?.. ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది. ఆస్ట్రేలియాకు చెందిన ఓ ఫాస్ట్ బౌలర్ అచ్చంగా బుమ్రా బౌలింగ్ వేసినట్టే బంతులను సంధించాడు.
పేరు నికొలస్ జేమ్స్ మ్యాడిన్సన్.. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్. అందరూ నిక్ మ్యాడిన్సన్‌గా పిలుస్తుంటారు. పార్ట్ టైం బౌలర్ గా అప్పుడప్పుడు స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థొడాక్స్ బౌలింగ్ వేస్తుంటాడు. అలా వేస్తే వికెట్లు పడతాయో లేదో అనుకున్నాడో ఏమో బుమ్రా అవతారమెత్తాడు. షెఫీల్డ్ షీల్డ్ 2021-022 ఫైనల్ వెస్టర్న్ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌ల జస్‌ప్రీత్ బుమ్రా శైలిలో బౌలింగ్ చేశాడు. రౌండ్ ద వికెట్ తీసుకుంటూ.. అచ్చం బుమ్రాలాగే రనప్ చేయడం, అతని లాగే చేతులను చాచి బంతులను వేయడం కనిపించింది. అందుకు సంబంధించిన వీడియో క్లిప్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా తన అధికారిక మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌పై పోస్ట్ చేసింది. ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది.
Nic Maddinson brings out the Bumrah! #SheffieldShield pic.twitter.com/rPQU5E7VW2
— cricket.com.au (@cricketcomau) April 4, 2022
ఇది కూడా చదవండి: IPL లో కొత్త రూల్స్! ఇలా.. అయితే టీంకి 20 మంది ఆడాలి!
ఈ వీడియో చుసిన నెటిజన్లు.. ‘చైనీస్ కాపీ ఆఫ్ బుమ్రా’ అని పిలుస్తుండగా.. మరికొందరు ఈ ఆస్ట్రేలియన్ క్రికెటర్ ను ఒక ఆట ఆడేసుకుంటున్నారు. ఫస్ట్ బ్యాటింగ్ ఎలా చేయాలో నేర్చుకో..ఇది కనుక బుమ్రా చూశాడు అనుకో.. నీకు మూడినట్లే అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరైతే.. ఒకవేళ బుమ్రా లెఫ్ట్ హ్యాండ్ బౌలెరైతే ఇలానే వేసేవాడేమో అని కామెంట్ చేస్తున్నారు. మరి మీరు బుమ్రా లెఫ్ట్ హ్యాండ్ బౌలింగ్ చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
That’s a Chinese copy of Bumrah 🤣🤣
— Rahul D / राहुल / راہول (@rdalwale) April 4, 2022
Left HANDED Bumrah. Lol😂😂 https://t.co/Nhtosif1A8
— Ashwini🇮🇳 (@AshuCric07) April 4, 2022
What is this 😂😂😂😂😂 mirror view bumrah https://t.co/dnImlMHlKp
— GOURAV_7 (@JhawarGourav7) April 4, 2022