టీమిండియా సూపర్ ఫామ్ లో ఉంది. శ్రీలంక, న్యూజిలాండ్ సిరీసులతో సక్సెస్ కొట్టేసిన మన జట్టు.. ఇప్పుడు ఆస్ట్రేలియాతో హోరాహోరీగా తలపడేందుకు సిద్ధమైపోయింది. సాధారణంగా పెద్ద జట్లు పర్యటనకు వచ్చినా, వెళ్లినా.. వార్మప్ మ్యాచులు పక్కా జరుగుతాయి. ఈసారి మాత్రం అలాంటివి ఏం లేకుండానే టీమిండియా, ఆస్ట్రేలియాతో నేరుగా టెస్టు, వన్డే సిరీస్ ఆడేయనుంది. ఇక సిరీస్ ప్రారంభానికి ముందు జట్టులోని ఆటగాళ్లతోపాటు మాజీలు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు అలానే ఆసీస్ మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అవి కాస్త అభిమానుల మధ్య చర్చనీయాంశమయ్యాయి.
ఇక విషయానికొస్తే.. భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే టెస్టు సిరీస్ ని బోర్డర్ గావస్కర్ ట్రోఫీ అని పిలుస్తారు. ఇరుదేశాల్లోనూ ఈ సిరీస్ జరుగుతూ ఉంటుంది. ఫిబ్రవరి 9 నుంచి మన దేశంలో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే 2004 నుంచి భారత్ లో ఆసీస్ ఒక్క టెస్టు సిరీస్ కూడా గెలవలేకపోయింది. గత రెండుసార్లు కూడా టీమిండియానే ట్రోఫీ కైవసం చేసుకోవడం విశేషం. ఆసీస్ సొంతగడ్డపై ఆ జట్టుని రెండు టెస్టు సిరీస్ లో మన జట్టు ఓడించింది. మరోవైపు ఈ సిరీస్ గెలవడం భారత్ కు చాలా కీలకం. ఎందుకంటే ఇందులో గెలిస్తే టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ లో అడుగుపెడతాం. అలానే ఈ ఫార్మాట్ లోనే టాప్ ర్యాంక్ లోకి వెళ్లిపోతాం. ఇలా ఆటగాళ్లందరూ సిరీస్ కు ప్లాన్స్ వేసుకుంటూ రెడీ అవుతున్న టైంలో ఆసీస్ మాజీ క్రికెటర్ ఇయానే హేలీ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
‘ఈ సిరీసులో పిచ్ లు రెండు జట్లకు సహకారం లభించేలా తయారుచేస్తే మంచిది. అంటే బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండటం, స్పిన్ బౌలింగ్ చేసేలా పిచ్ ఉంటే ఆసీస్ తప్పకుండా గెలిచేందుకు అవకాశముంది. కానీ స్టార్క్, లియాన్ బౌలింగ్ పై నాకు ఆందోళనగా ఉంది. గత సిరీస్ లో సరైన పిచ్ తయారు చేయలేదు. దీంతో తొలిరోజు నుంచే బంతి బౌన్స్ అయింది. ఇలా ఉంటే టీమిండియా చక్కగా ఆడేస్తుంది. భారత్ లో వికెట్లు తీయడానికి 10 ఛాన్సులు మాత్రమే ఉంటాయి. అదే ఆస్ట్రేలియాలో అయితే బౌన్స్, బంతికి ముందుకు కదలడం, వేగం.. ఇలా 10కి అదనంగా మరో 3 అవకాశాలు దొరుకుతాయి. వీటిలో కొన్ని వేస్ట్ అయినా పర్వాలేదు. కానీ టీమిండియాకు మాత్రం ఎలాంటి ఛాన్స్ ఇవ్వకూడదు. ఎందుకంటే ఎంత ఒత్తిడి ఉన్నాసరే భారత జట్టు తట్టుకోగలదు. ఇదే ఫార్ములాని ఆసీస్ కూడా పాటిస్తే బెటర్’ అని ఇయాన్ హేలీ చెప్పుకొచ్చాడు. దీన్నిబట్టి చూస్తే.. భారత్ తమకు అనుకూలంగా పిచ్ తయారు చేస్తుందని, తొండాట ఆడేస్తుందనేది హేలీ అభిప్రాయం. మరి ఈ మాజీ క్రికెటర్ వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారు. మీ ఓపెనియన్ కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
“I think if they produce fair Indian wickets, that are good batting wickets, to start with, (that) probably spin and spin pretty consistently but spin a long way, late in the match we (Australia) win,” Healy said#INDvAUS #BGT #BorderGavaskarTrophy #IanHealy pic.twitter.com/HTaiiC3ZLi
— Jega8 (@imBK08) February 3, 2023