కెయిర్న్స్ వేదికగా జరిగిన తొలివన్డేలో ఆస్ట్రేలియా జట్టు న్యూజిలాండ్ పై 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు 232 పరుగులు చేయగా, ఆసీస్ జట్టు 45 ఓవర్లకే లక్ష్యాన్ని చేధించింది. అయితే.. ఈ మ్యాచులో మాక్స్‌వెల్ అందుకున్న క్యాచ్.. మ్యాచ్ కే హైలైట్ గా నిలుస్తోంది. రెప్పపాటులో.. అదీ ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్నాడు మ్యాక్సీ. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
3 వన్డేల సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. అందులో భాగంగా ఇవాళ కెయిర్న్స్ వేదికగా జరిగిన తొలి వన్డేలో కంగారూలు ఘనవిజయం సాధించారు. 233 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ జట్టు 44 పరుగులకే 5 వికెట్లు కోల్పోయినప్పటికీ లక్ష్యాన్ని చేధించింది. అంతకుముందు టాస్ఓడి బ్యాటింగ్ దిగిన కివీస్ జట్టు నిలకడగానే ఆటను ప్రారంభించింది. ఆ సమయంలో బ్యాక్ వర్డ్ పాయింట్ మీదుగా మార్టిన్ గప్టిల్ కొట్టిన బాల్ ను మాక్స్‌వెల్ ఒంటి చేత్తో అందుకున్నాడు. ఈ క్యాచ్ కోసం మాక్స్‌వెల్ 100 శాతం ఎఫర్ట్స్ పెట్టడం హైలైట్ అని చెప్పొచ్చు.
ICYMI: Glenn Maxwell has a rare habit of making the extremely difficult look very, very easy #AUSvNZ pic.twitter.com/vw8AisJ3zy
— cricket.com.au (@cricketcomau) September 6, 2022
ఇక, మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్ కు న్యూజిలాండ్ ఏ దశలోనూ దూకుడుగా ఆటను ప్రారంభించలేదు. 40 ఓవర్ల వరకు పర్వాలేదనిపించినా.. ఆ తరువాత బ్యాటర్లు ఫెవిలియన్ కు క్యూ కట్టారు. చివరకు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. ఆపై.. 233 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 44 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన అలెక్స్ క్యారీ (99 బంతుల్లో 85), కెమరూన్ గ్రీస్ (92 బంతుల్లో 89 నాటౌట్) జంట అద్భుతమైన పోరాట పటిమ కనబర్చి జట్టును విజయతీరాలకు చేర్చారు. తదుపరి వన్డే సెప్టెంబర్ 8న ఇదే వేదికగా జరగనుంది. మాక్స్‌వెల్ క్యాచ్ పై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
What a match 🔥
From 44/5 at one point, Australia fight back to clinch the first ODI 👏
Watch #NZvAUS on https://t.co/CPDKNxoJ9v (in select regions) 📺 #CWCSL | 📝 Scorecard: https://t.co/3yQv87W5Z1 pic.twitter.com/6S5CTqlDVk
— ICC (@ICC) September 6, 2022