తొలి టెస్టు పరాభవంతో ఆస్ట్రేలియా కొత్త వ్యూహాలను రచిస్తోంది. ఎలాగైనా ఢిల్లీ టెస్టులో విజయం సాధించేందుకు రూటు మార్చింది. సిరీస్ కోసం కాకపోయినా గౌరవం కోసం అయినా రెండో టెస్టు గెలిచి తీరాల్సిందేనని భావిస్తోంది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా జరుగుతున్న తొలిటేస్టులో ఆస్ట్రేలియా ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమిపై అభిమానులే కాదు.. ఆస్ట్రేలియా మాజీలు, మీడియా కూడా వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇప్పటకైనా తీరు మార్చుకోవాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆట ముందు వరకు పిచ్ మీద ఆరోపణలు చేశారు. ఆట మొదలయ్యాక టీమిండియా ఆల్రౌండ్ ప్రదర్శన చేస్తుంటే.. ఆస్ట్రేలియా మాత్రం చేతులెత్తేసింది. నాలుగో రోజే ఆటను అటకెక్కించేశారు. ఇప్పుడు తర్వాతి మ్యాచ్ లు విజయం కోసమే కాదు.. గౌరవం కోసం కూడా ఆస్ట్రేలియా గెలవక తప్పుదు.
మొదటి మ్యాచ్ లో ఘోరంగా పరాభవం ఎదుర్కొన్ని ఆస్ట్రేలియా మిగిలిన మ్యాచ్ లలో తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి. సిరీస్ కోసం కాకపోయినా.. గౌరవం కోసం అయనా గెలవక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు ఆస్ట్రేలియా జట్టు రూటు మార్చి కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. తొలి టెస్టులో వారి ప్రణాళికలు అన్ని బెడిసికొట్టాయి. అందుకే ఇప్పుడు కొత్త కొత్త ప్లానులు అమలు చేయబోతున్నారని తెలుస్తోంది. అందులో భాగంగానే జట్టులోకి కొత్త స్పిన్నర్ ని తీసుకొచ్చారు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కుహేమన్ ను జట్టులోకి తీసుకున్నారు. ఢిల్లీ పిచ్ కూడా స్పిన్నర్లకు అనుకూలిస్తుంది అనే భావన కలిగితే కుహేమన్ ను తీసుకునేందుకు ప్లాన్ చేశారు.
🚨 Left-arm spinner Matthew Kuhnemann has been called up to replace Mitchell Swepson ahead of the second #INDvAUS Test in Delhi
Swepson is returning to Australia for the birth of his first child 👉 https://t.co/yWZeDbXotj pic.twitter.com/FEJcz6ibKa
— ESPNcricinfo (@ESPNcricinfo) February 12, 2023
తొలి టెస్టులో స్పిన్నర్లు కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. మొత్తం 30 వికెట్లలో 23 వికెట్లు స్పిన్నర్లే పడగొట్టారు. అందుకే రెండో టెస్టు విషయంలో ఆస్ట్రేలియా జాగ్రత్త వహించబోతోంది. తొలి టెస్టులో చోటు దక్కించుకోలేక పోయిన లెగ్ స్పిన్నర్ మిచెల్ స్వెప్సన్ స్థానంలో కుహేమన్ ను జట్టులోకి తీసుకున్నారు. కుహేమన్ ఇంకా ఎలాంటి అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ ఆడలేదు. ఢిల్లీ టెస్టు గనుక స్విన్ కి అనుకూలిస్తుందని భావిస్తే మాత్రం నాథన్ లైన్, టాడ్ మర్ఫీలతో పాటుగా కుహేమన్ ను తీసుకుంటారని చెబుతున్నారు. మరోవైపు వార్నర్ స్థానంలో ట్రావిస్ హెడ్ కు అవకాశం కల్పిస్తారనే వాదన కూడా వినిపిస్తోంది. ఫిబ్రవరి 17న ఢిల్లీ వేదికగా రెండో టెస్టు జరగనుంది.
Matthew Kuhnemann getting India ready in a short time #INDvAUS https://t.co/3gJjtET40T pic.twitter.com/pWOVsWKNH6
— Wasim Jaffer (@WasimJaffer14) February 12, 2023