కోహ్లీ అంటే ప్రపంచంలోని చాలా మంది బౌలర్లుకు భయం.. ఎక్కడ పరుగుల వరద పారిస్తాడో అని. అలాగే ఆస్ట్రేలియా జట్టు మొత్తానికి కూడా భయమే.. ఎక్కడ ఒక్కడే తమను దారుణంగా ఓడిస్తాడని, ఆ భయం మరోసారి బయటపడింది.
టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్, ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతి తక్కువ కాలంలో ప్రపంచ క్రికెట్‌ను శాసించే స్థాయికి చేరిన తీరే అతనేంటో చెబుతుంది. ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న కోహ్లీ.. మరెన్నో రికార్డులను బద్దలు కొట్టి, అత్యధిక సెంచరీలు చేసిన ప్రపంచ నంబర్ టూ బ్యాటర్‌గా సచిన్ టెండూల్కర్ తర్వాతి స్థానంలో నిలబడ్డాడు. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన చివరిదైన నాలుగో టెస్టులోనూ అద్భుతం ఇన్నింగ్స్ ఆడి, భారీ సెంచరీ బాదేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో సైతం కోహ్లీనే టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
కోహ్లీ ఫామ్‌లో ఉన్నా లేకున్నా.. ప్రత్యర్థి జట్టుకు మాత్రం అతనంటే భయం ఉంటుంది. ఆస్ట్రేలియాకు అయితే ఆ భయం మరి ఎక్కువగా ఉంటుంది. ఎందుకో తెలియదు.. కోహ్లీ వికెట్ దక్కితే మ్యాచ్ గెలిచేసినంత సంతోష పడుతుంటారు కంగారులు. కోహ్లీ వికెట్ కోసం దక్కించుకునేందుకు ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోరు. కోహ్లీ ఎక్కడ చిన్న తప్పు చేసి దొరికిపోతాడా అని వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే కోహ్లీ ఒక్కడు నిలబడితే.. తమ నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంటాడని వాళ్లకు బాగా తెలుసు. అందుకే.. కోహ్లీ అంటే ఆస్ట్రేలియాకు అంత భయం. అ భయమే మూడో వన్డే సందర్భంగా మరోసారి స్పష్టంగా బయటపడింది.
ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ 17 బంతుల్లోనే 2 ఫోర్లు, 2 సిక్సులతో 30 పరుగులు చేసి బాగా ఆడుతూ భారీ షాట్‌కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మ అవుట్ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లీ.. ఆరంభంలో బాల్ టూ బాల్ ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో కోహ్లీని ఒత్తిడిలోకి నెట్టేందుకు ఆస్ట్రేలియా ప్రయత్నించింది. బాల్ బ్యాట్‌కు తాకలేదని స్పష్టంగా తెలుస్తున్నా.. అప్పీల్ చేసింది. దానికి అంపైర్ అడ్డంగా తల ఊపినా కూడా రివ్యూ కోరుకున్నారు. రీప్లేలో బాల్‌కు బ్యాట్‌కు చాలా గ్యాప్ ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది. అది చూసిన తర్వాత దీనికి కూడా ఎవడైనా రివ్యూ తీసుకుంటారా? అని క్రికెట్ అభిమానులు నవ్వుకుంటున్నారు. కోహ్లీ మీద భయంతోనే ఆస్ట్రేలియా ఇలా చేస్తుందంటూ పేర్కొంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Not the best review for a caught behind appeal …. #INDvAUS pic.twitter.com/nZ85N1E98b
— cricket.com.au (@cricketcomau) March 22, 2023
Virat Kohli and Steve Smith’s reaction to the DRS review😂
📷: Disney+Hotstar#ViratKohli #SteveSmith #ODI #ODIs #INDvAUS #INDvsAUS #Cricket #SBM #IndiavsAustralia pic.twitter.com/GsqSc86bnM
— SBM Cricket (@Sbettingmarkets) March 22, 2023