మరో స్టార్ టీ20 ప్లేయర్, ఆల్ రౌండర్.. క్రికెట్ లో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఫ్యాన్స్ కి ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్సులను జ్ఞాపకాలుగా మిగిల్చి సైలెంట్ గా గేమ్ నుంచి తప్పుకొనేందుకు సిద్ధమైపోయాడు. ఆ విషయాన్ని చెబుతూ ట్వీట్ కూడా చేశాడు. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక జాతీయ జట్టు తరఫున కొన్ని మ్యాచులే ఆడిన ఇతడు… టీ20 లీగుల్లో మాత్రం తనదైన ముద్ర వేశాడు. చాలామందికి సాధ్యం కాని రికార్డులని కూడా క్రియేట్ చేశాడు. ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరు? ఏం ఘనతలు సాధించాడనేది ఇప్పుడు చూద్దాం.
ఇక విషయానికొస్తే.. బిగ్ బాష్ లీగ్ తో గుర్తింపు తెచ్చుకున్న వారిలో చాలామంది ఉన్నారు. ఆ తర్వాత కాలంలో వాళ్లు ఆస్ట్రేలియా జాతీయ జట్టులోనూ చోటు దక్కించుకున్నారు. అయితే డాన్ క్రిస్టియన్ మాత్రం టీ20 లీగ్స్ లో చాలా పాపులర్ అయ్యాడు. 2005 నుంచి బిగ్ బాష్ లో ఆడుతున్న డాన్.. ప్రస్తుతం సిడ్నీ సిక్సర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ సీజన్ లో ఆ జట్టు ఫైనల్ లో అడుగుపెట్టేలా కనిపిస్తుంది. ఇలా అంతా బాగానే ఉందనుకునే టైంలో తాను రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు డాన్ క్రిస్టియన్ ప్రకటించాడు. ఈసారి బిగ్ బాష్ లీగ్ తనకు చివరదని చెప్పుకొచ్చాడు. సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టాడు.
దాదాపు 17 ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్న క్రిస్టియన్ వయసు ఇప్పుడు 40 ఏళ్లు. ఆసీస్ జట్టు తరఫున 23 టీ20లు, 20 వన్డేలు ఆడిన మనోడు.. పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. కానీ ఏడు వివిధ లీగ్స్ లో ఆడిన క్రిస్టియన్ 18 జట్లలో ఆల్ రౌండర్ గా బాధ్యతలు నిర్వర్తించాడు. అలా 405 టీ20 మ్యాచుల్లో 5809 పరుగులు చేయడంతో పాటు 280 వికెట్లు కూడా తీసి టీ20 స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇక 2010 నుంచి ఇప్పటివరకు దాదాపు తొమ్మిదిసార్లు.. విజేతగా నిలిచిన జట్టులో సభ్యుడిగానూ క్రిస్టియన్ ఉండటం మరో విశేషం. ఇదిలా ఉండగా ఐపీఎల్ లోనూ డెక్కన్ ఛార్జెర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్, దిల్లీ డేర్ డెవిల్స్ జట్ల తరఫున ఆడాడు. మరి క్రిస్టియన్ రిటైర్మెంట్ పై మీరేం అనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
Some news 😁 pic.twitter.com/5xxxkYNQGt
— Dan Christian (@danchristian54) January 20, 2023