స్వదేశంలో జరగబోయే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి జట్టును ప్రకటించింది క్రికెట్ ఆస్ట్రేలియా. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతున్న ఆస్ట్రేలియా, అందుకు తగ్గట్టే పకడ్భంధీ జట్టును సిద్ధం చేసింది. అలాగే.. భారత పర్యటనకు కూడా జట్టును ప్రకటించింది. ఈ జట్టులో రెండు అనూహ్య మెరుపులు కనిపిస్తున్నాయి. ఒకటి.. ఆసీస్ రెగ్యులర్ జట్టులో సింగపూర్ క్రికెటర్ కు చోటు కల్పించగా, టీమిండియాతో టీ20 సిరీస్ కు డేవిడ్ వార్నర్ కు చోటు లేకపోవడం మరొకటి.
ఈ ఏడాది అక్టోబర్ నుంచి ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఆసీస్ జట్టు బరిలోకి దిగుతోంది. అందుకోసం గట్టి జట్టునే సిద్ధం చేసింది. బ్యాటర్లు, బౌలర్లు, హిట్టర్లు, ఆల్‌రౌండర్లతో కూడిన సమతూకమైన 15 మందిని ఎంపిక చేసింది. ఈ జట్టుకు ఆరోన్ ఫించ్ సారధ్యం వహించనున్నాడు. ఈ జట్టులో సింగపూర్ క్రికెటర్ టిమ్ డేవిడ్ కు చోటు కల్పించారు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన డేవిడ్.. వాస్తవానికి సింగపూర్ వాసి. కానీ అతడి తల్లిదండ్రులు మాత్రం ఆస్ట్రేలియాకు చెందినవారు. పలు మ్యాచ్‌లలో సింగపూర్‌కు ప్రాతినిథ్యం వహించాడు కూడాను. ఐసీసీ నిబంధనల మేరకు టిమ్ డేవిడ్‌ను తమలో కలిపేసుకుంది ఆస్ట్రేలియా.
ఇక.. టీ20 ప్రపంచకప్ సమరానికి ముందు ఆసీస్ జట్టు, టీమిండియాతో మూడు మ్యాచుల టీ20 సిరీస్ ఆడనుంది. సెప్టెంబర్ 20-25 మధ్య ఈ సిరీస్ జరగనుంది. విశ్రాంతి పేరిట ఈ సిరీస్ నుంచి వార్నర్ కు మినహాయింపు నిచ్చారు. అతని స్థానంలో కామరూన్ గ్రీన్ కు అవకాశం ఇచ్చారు.
ఇండియా vs ఆస్ట్రేలియా (టీ20 సిరీస్ షెడ్యూల్)
ఈ మ్యాచులన్ని భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానున్నాయి.
టీ20 ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), పాట్ కమిన్స్ (వైస్ కెప్టెన్), డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మిచెల్ మార్ష్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్(కీపర్), జోష్ ఇంగ్లిస్(కీపర్), జోష్ హెజిల్వుడ్, ఆస్టన్ అగర్, కేన్ రిచర్డ్సన్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.
టీమిండియాతో తలపడబోయే ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), పాట్ కమిన్స్ (వైస్ కెప్టెన్), స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మిచెల్ మార్ష్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, కామరూన్ గ్రీన్, మాథ్యూ వేడ్(కీపర్), జోష్ ఇంగ్లిస్(కీపర్), జోష్ హెజిల్వుడ్, ఆస్టన్ అగర్, కేన్ రిచర్డ్సన్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.
Australia announced squad for India tour and T20 World Cup 2022 pic.twitter.com/9GbxINaSvG
— Govardhan Reddy (@gova3555) September 1, 2022