ది యాషెస్ సిరీస్ అంటేనే క్రికెట్ అభిమానులకు పూనకాలు వస్తాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ అభిమానులకైతే నరాలు తెగే ఉత్కంఠ ఉంటుంది అనడంలో సందేహం లేదు. అది మైదానంలా కాదు.. యుద్ధ భూమిలా ఉంటుంది. స్లెడ్జింగ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ 147 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ మ్యాచ్ లో మిచెల్ స్టార్క్ ఒక అరుదైన ఘనత సాధించాడు. దాదాపు 85 ఏళ్ల తర్వాత ఆ ఘనత సాధించిన ఆస్ట్రేలియా పేసర్ గా మిచెల్ స్టార్క్ రికార్డుల కెక్కాడు. తొలి టెస్టు తొలి బంతికే ఇంగ్లాండ్ ఓపెనర్ రోరీ బర్న్స్ ను గోల్డెన్ డక్ గా పెవిలియన్ కు చేర్చాడు స్టార్క్.
WHAT A WAY TO START THE #ASHES! pic.twitter.com/XtaiJ3SKeV
— cricket.com.au (@cricketcomau) December 8, 2021
85 ఏళ్ల తర్వాత యాషెస్ సిరీస్ చరిత్రలో ఒక ఆస్ట్రేలియన్ పేసర్ తొలి టెస్టు తొలి బంతికే వికెట్ తీయడం ఇది రెండోసారి. 1936లో ఇంగ్లండ్ ఓపెనర్ స్టాన్ వర్తింగ్ టన్‌ను ఆస్ట్రేలియా పేసర్ ఎర్నీ మెక్‌కార్మిక్ తొలి బంతికే డకౌట్ చేశాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ 147 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ప్యాట్ కమిన్స్ 5 వికెట్లు తీశాడు. స్టార్క్, హేజల్ వుడ్ చెరే 2 వికెట్లు, కామెరూన్ గ్రీన్ ఒక వికెట్ తీశాడు. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్లు ఎవరూ అంతగా ఆకట్టుకోలేదు. జోస్ బట్లర్ ఒక్కడే 39 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
The art The artist pic.twitter.com/iRVJAmx2Q0
— cricket.com.au (@cricketcomau) December 8, 2021