బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో టీమిండియా ప్రదర్శనపై ప్రశంసల వర్షం కురుస్తుంటే.. ఆస్ట్రేలియాపై మాత్రం విమర్శలు జోరందుకున్నాయి. సొంత అభిమానులు, మాజీ క్రికెటర్లు వారి పర్ఫార్మెన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో టీమిండియా బోణీ కొట్టింది. 3 టెస్టుల సిరీస్ ను ఘన విజయంతో ప్రారంభించింది. ఒకరోజు ముందే ఇన్నింగ్స్ 132 పరుగుల ఆధిక్యంతో భారత్- ఆస్ట్రేలియా అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. టీమిండియా అల్రౌండ్ ప్రదర్శనతో ఆసీస్ కు కష్టాలు తప్పలేదు. ముఖ్యంగా రీఎంట్రీ తర్వాత జడేజా ఆల్రౌండ్ ప్రదర్శన టీమిండియాకు కలిసొచ్చింది. మ్యాచ్ కు ముందు పిచ్ మీద ఆరోపణలు చేస్తూ వచ్చారు. కానీ, టీమిండియా మంచి స్కోర్ చేస్తుంటే.. ఆసీస్ మాత్రం ఆడలేక చేతులెత్తేసింది. పైగా రెండో ఇన్నింగ్స్ లో కేవలం 91 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ మ్యాచ్ లో ఆసీస్ చేసిన ప్రదర్శనపై సొంత ఫ్యాన్స్, వారి మాజీ క్రికెటర్లే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నాగ్ పూర్ పేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ అద్భుతమైన ప్రదర్శన చేసింది. ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఆసీస్ ప్రదర్శనపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా వారి మాజీలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు అలన్ బోర్డర్ జట్టు ప్రదర్శనపై తీవ్రంగా స్పందించాడు. ప్రత్యర్థులు అద్భుతంగా బౌలింగ్ చేస్తుంటే మీరు మాత్రం థంబ్స్ అప్ చూపిస్తున్నారా? అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్న ముఖ్యంగా స్టీవ్ స్మిత్ కోసం వేసినట్లే అనిపించింది. అలా చేయడానికి మీకు సిగ్గుగా లేదా? అన్నట్లుగా అలన్ బోర్డ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
A thumbs up from Steve Smith to India’s bowlers.. 😜#INDvAUS pic.twitter.com/Ge5btXkG5t
— Wisden India (@WisdenIndia) February 11, 2023
“ఆస్ట్రేలియా జట్టు అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్నట్లు నాకు అనిపించడం లేదు. ఆఫ్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ వేస్తుంటే మీరు థంబ్స్ అప్ చూపిస్తూ శభాష్ అంటున్నారు. ఆస్ట్రేలియా జట్టు బంతులు ఎదుర్కోవడానికి ఇబ్బందులు పడుతూ.. అవతలి వారిని హేళన చేసినట్లు ప్రవర్తించడం నిజంగా అసహనానికి గురి చేసింది. మిగిలిన సిరీస్ లో గెలవాలంటే ఆస్ట్రేలియా వద్ద సరైన వ్యూహం లేకపోతే చాలా కష్టం. ఈ టెస్ట్ సిరీస్ గెలవాలంటే ఆసీస్ అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. బ్యాటింగ్, బౌలింగ్ లో సమష్టి కృషితో మీరు ప్రదర్శన చేయాల్సి ఉంటుంది” అంటూ అలన్ బోర్డర్ వ్యాఖ్యానించారు.
UNPLAYABLE delivery by Ravindra Jadeja to get rid of Steve Smith 🔥🇮🇳 #IndvsAus pic.twitter.com/IbNAL9efMg
— Sushant Mehta (@SushantNMehta) February 9, 2023
మరోవైపు ఆస్ట్రేలియా పరాజయంపై ఆసీస్ మీడియా సైతం చురకలు అంటించింది. ఇండియా 400 పరుగులు నమోదు చేసిన తర్వాత పిచ్ పై ఫిర్యాదు చేయడానికి ఏమీ లేదు. ఆస్ట్రేలియా నిర్ణయాలు, ప్రదర్శన, ఫీల్డింగ్ లో చేసిన తప్పిదాలు, క్యాచ్ డ్రాప్ లు అన్నీ కలిపి ఘోర పరాభవానికి కారణమైనట్లు వ్యాఖ్యానిచాయి. ట్రావిస్ హెడ్ న్ ఎందుకు తుది జట్టులోకి తీసుకోలేదు అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఇన్నిసార్లు విఫలమవుతున్నా కూడా డేవిడ్ వార్నర్ కు ఇంకా జట్టులో చోటు ఎలా దక్కుతోంది? అంటూ ఆస్ట్రేలియా మీడియా పలు ప్రశ్నలు సంధించింది. ఎంత ఘోరంగా సిరీస్ ని ప్రారంభించాలో అంతకన్నా ఘోరంగా ప్రారంభించాం. తర్వాతి మ్యాచుల్లో అయినా ఆసీస్ పుంజుకుంటుందేమో చూడాలి అంటూ వార్తలు రాసుకొచ్చారు.
Allan Border is not at all impressed by Steve Smith giving a thumbs up to the Indian bowlers for beating him outside his off-stump.#INDvAUS #BGT2023 pic.twitter.com/qoJnHe1OzJ
— Circle of Cricket (@circleofcricket) February 11, 2023