ది యాషెస్ సరీస్ 2021-22ను ఆసీస్ 3-0 తేడాతో కైవసం చేసుకుంది. మూడు వరుస టెస్టు మ్యాచుల్లో ఇంగ్లాండ్ ను చిత్తుగా ఓడించి కంగారూలు సిరీస్ ను గెలుచుకున్నారు. అంతేకాదు మూడో టెస్టులో మరో అద్భుతం కూడా జరిగింది. ఇంగ్లాండ్ పై ఆసీస్ ఇన్నింగ్స్ 14 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అందులో కీలక పాత్ర పోషించాడు డెబ్యూ బౌలర్ స్కాట్ బోలాండ్. అరంగేట్ర మ్యాచ్ లోనే 6 వికెట్లు పడగొట్టి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
Still on a high after yesterdays series win! #Ashes pic.twitter.com/ctSJgrOjj3
— Pat Cummins (@patcummins30) December 28, 2021
స్కాట్ బోలాండ్ ఇప్పుడు ఈ పేరు క్రికెట్ ప్రపంచంలో తెగ వైరల్ అవుతోంది. ఇంగ్లాండ్ ను నిర్దాక్షిణ్యంగా 68 పరుగులకే ఆలౌట్ చేయడంలో బోలాండ్ ది ప్రధాన పాత్ర. 4 ఓవర్లు వేసి కేవలం 7 పరుగులే ఇచ్చి 6 వికెట్లను పడగొట్టాడు. టెస్టు మ్యాచ్ కేవలం రెండున్నర రోజులకే ముగిసేలా చేశాడు. డెబ్యూ మ్యాచ్ లోనే అత్యంత వేగంగా టెస్టుల్లో 5 వికెట్లు తీసిన మూడో బౌలర్ గా జాబితాలోకి చేరాడు. 1947లో భారత జట్టుపై తోషాక్, 2015లో ఆస్ట్రేలియాపై స్టువర్ట్ బ్రాడ్ అత్యంత వేగంగా ఐదు వికెట్ల రికార్డు సాధించాడు. అంతేకాకుండా జానీ ముల్లాగ్ మెడల్ కూడా అందుకున్నాడు.
Who’s writing Scott Boland’s script!? 😱
The England captain snicks off and Boland has four! 🤯 #Ashes pic.twitter.com/tjFrwDHLte
— cricket.com.au (@cricketcomau) December 28, 2021
‘టెస్టు మ్యాచ్ ఇంత త్వరగా పూర్తవుతుందని అనుకోలేదు. జట్టు సభ్యులు, నా కుటుంబసభ్యులు, అభిమానులకు ధన్యవాదాలు. ప్రేక్షకులు గత మూడు రోజులుగా నాకు ఎంతో సపోర్ట్ చేశారు. జానీ ముల్లాగ్ మెడల్ సాధించడం చాలా ఆనందంగా ఉంది. 1868 టూర్ గురించి ఎన్నో విషయాలు తేలుసుకున్నాం. నా హోమ్ గ్రౌండ్ లో ఈ ఘనత సాధించడం ఎంతో సంతోషంగా ఉంది. నా కోచెస్ కు కృతజ్ఞతలు. నా కుటుంబం, నా భార్య, నా ఇద్దరు పిల్లలకు ప్రత్యేక ధన్యవాదాలు’ అంటూ ప్రపంచ రికార్డు, జానీ ముల్లాగ్ మెడల్ సాధించిన స్కాట్ బోలాండ్ తన మనసులో మాటను ప్రేక్షకులతో పంచుకున్నాడు. స్కాట్ సాధించిన ఈ ఘనతపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
We caught up with the man of the moment @sboland24 shortly after his instantly iconic performance at the ‘G!#Ashes | @alintaenergy pic.twitter.com/f5vY889xEf
— cricket.com.au (@cricketcomau) December 28, 2021