ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ ఓలీ రాబిన్సన్ స్లెడ్జింగ్ చేయడంలో ముందే ఉంటాడు. ఇటీవలే యాషెస్ మొదటి టెస్టులో భాగంగా ఆసీస్ ఓపెనర్ ఖవాజాని స్లెడ్జింగ్ చేసినట్టు వీడియోలో క్లియర్ గా తేలింది. అయితే ఈ విషయంలో ఆసీస్ ఫ్యాన్స్ ఈ ఫాస్ట్ బౌలర్ మీద ఫైర్ అవుతున్నారు. నీకు కోహ్లీనే కరెక్ట్ ట్రీట్ మెంట్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
యాషెస్ లో స్లెడ్జింగ్ అనేది మామూలే. ఈ సిరీస్ ఎప్పుడు జరిగినా వికెట్ రాని సమయంలో బౌలర్లు బ్యాటర్ ఏకాగ్రతను చెడగొట్టడానికి వారిని మాటలతో రెచ్చగొడుతూ ఉంటారు. ఎక్కువగా బౌలర్లు ఇలాంటి స్లెడ్జింగ్ కి పాల్పడతారు. ఈ లిస్టులో ఇంగ్లాండ్ బౌలర్ ఓలీ రాబిన్సన్ ముందు వరుసలో ఉంటాడు. యాషెస్ లో భాగంగా జరిగిన మొదటి టెస్టులో ఆసీస్ ఓపెనర్ ఖవాజాని చివరి రోజు రాబిన్సన్ స్లెడ్జింగ్ చేసినట్లు వీడియోలో స్పష్టంగా తెలిసింది. దీంతో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఈ విషయంలో ఈ ఇంగ్లాండ్ పేసర్ పై ఫైర్ అయ్యాడు. అయితే రాబిన్సన్ తగ్గేదే లేదన్నట్లుగా పాంటింగ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆసీస్ ఫ్యాన్స్ ఇప్పుడు రంగంలోకి దిగారు. నీకు కోహ్లీనే కరెక్ట్ అని అతని మీద సెటైర్లు వేస్తున్నారు.
రాబిన్సన్ కి గొడవలు కొత్తేమి కాదు. 2021 లో భారత్ తో సిరీస్ లో భాగంగా కోహ్లీతో సహా.. మిగిలిన టీమిండియా ఆటగాళ్లు బ్యాటింగ్ విధానంపై రాబిన్సన్ అనుచిత వ్యాఖ్యలు చేసాడు. దీంతో ఆ టెస్టు మ్యాచు కాస్త మాటలతో హీటెక్కింది. అయితే స్లెడ్జింగ్ చేస్తే విరాట్ కోహ్లీ ఊరుకుంటాడా? అంతకంతకు ఇచ్చి పడేస్తాడు. రాబిన్సన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కోహ్లీ.. కమాన్ రాబిన్సన్ నువ్వు ఇవ్వలైనా ఖాతా తెరుస్తావా ? నీ ఇన్నింగ్స్ మరీ బోరింగ్ గా ఉంది. టెస్టు మ్యాచులో ఎలా రానిస్తావు. అని రాబిన్సన్ ని ఉద్దేశించి కోహ్లీ వ్యాఖ్యలు చేసాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
యాషెస్ లో రాబిన్సన్ ప్రవర్తన ఆసీస్ మాజీ ఆటగాళ్లతో పాటు ఫ్యాన్స్ కి నచ్చడం లేదు. దీంతో రాబిన్సన్ మీద ఫైర్ అయిన ఫ్యాన్స్.. నీకు బుద్ధి చెప్పడానికి కోహ్లీనే కరెక్ట్ అని ఈ ఫాస్ట్ బౌలర్ పై మండిపడుతున్నారు. యాషెస్ లో రాబిన్సన్ కి కోహ్లీ ట్రీట్ మెంట్ ఇవ్వాలని ఆసీస్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మొత్తానికి యాషెస్ లో కోహ్లీ ప్రస్తావన రావడం ఇప్పుడు వైరల్ గా మారింది. దీని బట్టి కోహ్లీ అగ్రెస్సివ్, క్రేజ్ ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
I want to see Aussies do this to Ollie Robinson in the next test pic.twitter.com/Nskmp5dzBz
— ABBA Fan (@_Blindinho_) June 23, 2023