భారతదేశంలో క్రికెట్ కు ఉన్న ఆదరణ అంతా ఇంత కాదు. క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే చాలు ఆఫీస్ లకు సెలవులు పెట్టి మరీ టీవీలకు అతుక్కుపోతారు క్రికెట్ ప్రేమికులు. ఇక ఇండియా-పాక్ మ్యాచ్ జరుగుతుంది అంటే చాలు ప్రభుత్వాలు సెలవులు ప్రకటించిన సందర్బాలూ ఉన్నాయి. ఇక ప్రస్తుతం శ్రీలంకపై టీ20 సిరీస్ నెగ్గి.. ఉత్సాహంతో ఉంది టీమిండియా. మంగళవారం నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే తొలి వన్డే అస్సాంలోని గౌహతి వేదికగా జరగబోతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియా-శ్రీలంక మ్యాచ్ చూడడానికి హాఫ్ డే సెలవు ప్రకటించింది అస్సాం రాష్ట్ర ప్రభుత్వం. మరిన్ని వివరాల్లోకి వెళితే..
2023 వరల్డ్ కప్ గెలవడమే ధ్యేయంగా సిద్ధమవుతోంది టీమిండియా. అందులో భాగంగానే.. తొలి వన్డే సిరీస్ ను లంకతో ఆరంభించబోతోంది. ఇప్పటికే టీ20 సిరీస్ ను 2-1తో చేజిక్కించుకున్న భారత్.. వన్డే సిరీస్ ను కూడా కైవసం చేసుకోవాలని ఊవ్విళ్లూరుతోంది. అందులో భాగంగానే మంగళవారం జరిగే తొలి మ్యాచ్ కు గౌహతిలోని బర్సపరా స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ ను చూసేందుకు అభిమానులు భారీగా వస్తారని అంచనా వేసిన అస్సాం రాష్ట్ర ప్రభుత్వం అభిమానుల కోసం ఆ రోజు హాఫ్ డే లీవ్ ను ప్రకటించినట్లు ప్రముఖ వార్తా సంస్థ అయిన పీటీఐ తెలిపింది.
Assam government announced a half-day holiday in Kamrup Metropolitan district for watching the 1st ODI between India & Sri Lanka. (Source – PTI)
— Johns. (@CricCrazyJohns) January 9, 2023
ఈ క్రమంలోనే మ్యాచ్ జరిగే ప్రాంతం అయిన కామరూప మెట్రోపాలిటిన్ జిల్లాలో ఈ మ్యాచ్ ను చూసేందుకు హాఫ్ డే సెలవును ప్రకటించింది. దాంతో క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదేం ఇండియా-పాక్ మ్యాచ్ కాదుగా పైగా వరల్డ్ కప్ లో కీలక మ్యాచ్ కూడా కాదు. మరి అలాంటింది ఈ మ్యాచ్ కు సెలవు ప్రకటించడం ఏంటి అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ లో బరిలోకి దిగబోతున్నారు సీనియర్లు. టీ20 సిరీస్ కు విశ్రాంతిలో ఉన్న విరాట్, రోహిత్, రాహుల్ లు బరిలోకి దిగనున్నారు. వారితో పాటుగా కొన్ని నెలలుగా జట్టుకు దూరంగా ఉన్న టీమిండియా స్పీడ్ స్టర్ బూమ్రా.. తిరిగి జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు.