ఇండియా-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు అసలు సిసలైన క్రికెట్ మజాను అందించే మ్యాచ్ ఏదైన ఉందంటే.. అది భారత్-పాక్ మ్యాచ్. ఈ రెండు దేశాలు క్రికెట్ ఆడుతున్నాయంటే.. అదో మినీ యుద్ధమే. గెలుపుకోసం ఇరుదేశాల ఆటగాళ్లు ప్రాణం పెట్టి ఆడతారు. అయితే ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వివిధ కారణాల నేపథ్యంలో ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ ఈవెంట్స్‌లోనే మాత్రమే భారత్-పాక్ తలపడుతున్నాయి. వరల్డ్ కప్ టోర్నీలతో పాటు ఆసియా కప్ టోర్నీలోనూ భారత్-పాక్ మధ్య మ్యాచ్‌లు జరుగుతున్నాయి. గతేడాది ఆసియా కప్ 2022లో సైతం భారత్-పాక్ మధ్య రెండు మ్యాచ్‌లు జరిగాయి. ఒక మ్యాచ్‌లో భారత్, మరో మ్యాచ్ పాక్ గెలిచింది.
ఆ తర్వాత.. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022లో తొలి మ్యాచ్ పాకిస్థాన్‌తోనే ఆడిన టీమిండియా.. నరాలు తెగే ఉత్కంఠ మధ్య అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్ తర్వాత మళ్లీ భారత్-పాక్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే.. వారికి గుడ్‌న్యూస్ చెబుతూ.. ఆసియా కప్ 2023 కోసం గ్రూప్ షెడ్యూల్ విడుదలైంది. అయితే.. ఇందులో మరో విశేషం ఏమిటంటే.. ఇండియా-పాకిస్థాన్ రెండు ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. దీంతో ఆసియా కప్ 2023లో భారత్-పాక్ మధ్య కచ్చితంగా రెండు మ్యాచ్‌లు జరిగే అవకాశం పుష్కలంగా ఉంది. ఇక ఈ రెండు జట్లు ఫైనల్ చేరితో.. ముచ్చటగా మూడు మ్యాచ్‌లు భారత్-పాక్ మధ్య జరిగే అవకాశం ఉంది.
ఆసియా కప్ 2023లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయి. గ్రూప్-ఏలో మూడు టీమ్స్, గ్రూప్-బీలో మూడు టీమ్స్ ఉన్నాయి. గ్రూప్-ఏలో ఇండియా, పాకిస్థాన్‌తో పాటు క్వాలిఫైయర్ టీమ్ ఉంటుంది. ఇక గ్రూప్ బీలో డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంక, బంగ్లాదేశ్‌తో పాటు అఫ్ఘనిస్థాన్ ఉన్నాయి. అయితే.. ఈ సారి ఆసియా కప్ 2023కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే. అయితే భారత జట్టును పాకిస్థాన్ పంపేందుకు బీసీసీఐ సిద్ధంగా లేదు. కానీ.. భారత జట్టు పాక్‌కు రావాలని పీసీబీ చాలా సార్లు కోరింది. భారత జట్టు పాక్‌కు రాకుంటే.. తాము కూడా వన్డే వరల్డ్ కప్ 2023 ఆడేందుకు ఇండియా రామంటూ.. బెదిరింపులకు కూడా పాల్పడింది. అయితే.. ఆసియా కప్ 2023కు ఇంకా సమయం ఉండటంతో అప్పటి వరకు ప్రభుత్వంతో చర్చించి ఇరు బోర్డులు నిర్ణయం తీసుకుంటాయని క్రికెట్ అభిమానులు ఆశపడుతున్నారు. మరి ఆసియా కప్ ఆడేందుకు టీమిండియా పాకిస్థాన్ వెళ్లాలా? వద్దా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Here are the groups for men’s ODI Asia Cup 2023.
The tournament is scheduled to start in September. Venue is yet to be finalised by ACC.
📸: CricTracker#AsiaCup2023 #AsiaCup #Pakistan #India #Cricket #CricketTwitter pic.twitter.com/Qpa3oiszKE
— CricStats (@_CricStats_) January 5, 2023