ఆసియా కప్ 2022లో తొలి మ్యాచ్‌లో పాక్‌ను ఓడించిన టీమిండియా.. సూపర్ ఫోర్ తొలి మ్యాచ్‌లో మాత్రం నిరాశపర్చింది. చిరకాల ప్రత్యర్థిని ఆసియా కప్‌లోనే మరోసారి ఓడించే అవకాశం వచ్చిందని సంబరపడిన క్రికెట్ అభిమానులకు షాకిస్తూ.. 5 వికెట్ల తేడాతో ఓడింది. ఈ మ్యాచ్‌లో కీలక సమయంలో టీమిండియా బౌలర్ అర్షదీప్ సింగ్.. పాక్ హిట్టర్ ఆసిఫ్ అలీ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను నేలపాలు చేశాడు. దీంతో అర్షదీప్ సింగ్‌పై సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు, దారుణమైన ట్రోలింగ్ జరిగింది. వికీపీడియాలో అర్షదీప్ సింగ్‌ను ఖలిస్థానీ అంటూ పేర్కొనడం సంచలనంగా మారింది. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. యువ క్రికెటర్ చేసిన చిన్న తప్పును భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదంటూ మాజీ క్రికెటర్లు సైతం అర్షదీప్‌సింగ్‌కు మద్దతు పలికారు.
ఒత్తిడిలో అలాంటివి జరగడం సహజమని టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం మ్యాచ్ అనంతరం అర్షదీప్‌కు మద్దతు తెలిపాడు. అయినా కూడా సోషల్ మీడియాలో అర్షదీప్‌పై విమర్శలు ఆగలేదు. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఈ విషయంపై కాస్త గట్టిగానే స్పందించాడు. అర్షదీప్ సింగ్‌పై సోషల్ మీడియలో జరుగుతున్న దాడిపై యువీ స్పందిస్తూ..‘ఇంట్లో కూర్చొని ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ చూస్తూ.. మ్యాచ్ ఉత్కంఠగా సాగుతున్నంత సేపు కుర్చీ అంచుకు వచ్చి కూర్చుంటూ మీరే అంత టెన్షన్ ఫీలవుతుంటే.. మరీ మైదానంలో ఆటగాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. అయినా ఒక క్యాచ్ జారవిడిచినంత మాత్రానా ఆ ఆటగాడి సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయలేం. క్రికెట్‌ను ప్రేమించే దేశంగా ఈ టైమ్‌లో మనం ఐక్యంగా ఉండి యువ క్రికెటర్‌ను విమర్శించడానికి బదులు అతనికి మద్దతు తెలపాలి. మోర్ పవర్‌టూ యూ అర్షదీప్ సింగ్’ అంటూ యువీ పేర్కొన్నాడు.
కాగా.. ఆసియా కప్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన ఇండియా.. సూపర్ ఫోర్ తొలి మ్యాచ్‌లో పాక్ చేతిలో ఓడింది. ఈ ఓటమికి టాస్ ఓడిపోవడం, మిడిల్డార్ వైఫల్యం, ఫేలవ బౌలింగ్‌తో పాటు రెండో ఇన్నింగ్స్ సమయంలో డ్యూ పడటం కూడా భారత్ ఓటమికి కారణంగా నిలిచాయి. కానీ.. అర్షదీప్ క్యాచ్ వదిలేయడంపైనే ఎక్కువగా విమర్శలు వచ్చాయి. ఇండియా-పాకిస్థాన్ లాంటి హైప్రెషర్ గేమ్‌లో 23 ఏళ్ల యువ క్రికెటర్ ఒత్తిడికి గురి కావడం సహజం. 18వ ఓవర్‌లో క్యాచ్ వదిలేసిన అర్షదీప్ ఎంతో ధైర్యంగా చివరి ఓవర్‌లో 6 బంతుల్లో 7 పరుగులు డిఫెండ్ చేయడానికి ముందు కొచ్చాడు. ఆ ఓవర్‌లో పాక్ 7 పరుగులు చేయడానికి 5 బంతులు తీసుకుంది. ఇలా క్యాచ్ డ్రాప్ చేసినా అర్షదీప్ కాన్ఫిడెన్స్‌ను మెచ్చుకోవాలని క్రికెట్ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: టీ20ల్లో టాప్ 5 క్రికెటర్లను ప్రకటించిన పాంటింగ్! భారత్ నుంచి ఇద్దరు..
If you were at the edge of ur seat during #IndiaVSPak, imagine the pressure on the players in the park!
One dropped catch doesn’t define ability. We need to unite as a cricket loving nation & support youngsters instead of criticising them.
More power to you @arshdeepsinghh 🇮🇳
— Yuvraj Singh (@YUVSTRONG12) September 5, 2022