Asia Cup 2022, Super- 4, India vs Pakistan: 6 జట్ల మధ్య ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఆసియా కప్ టోర్నీకి కీలక ఆటగాళ్లు ఒక్కొక్కరిగా దూరమవుతూనే ఉన్నారు. ఇప్పటికే.. టీమిండియా క్రికెటర్లు జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ గాయం కారణంగా దూరమవ్వగా, శ్రీలంక క్రికెటర్ దుష్మంత చమీరా, పాక్ క్రికెటర్లు షాహీన్ అఫ్రిదీ, మహమ్మద్ వసీం జూనియర్ సైతం గాయాల కారణంగా దూరమయ్యారు. ఇప్పుడు మరో కీలక ఆటగాడు పక్క టెముకల గాయంతో ఆదివారం జరిగే దాయాదుల పోరుకు దూరమయ్యాడు. ఆ వివరాలు..
ఆసియాకప్‌లో భాగంగా భారత్‌తో జరగనున్న సూపర్-4 మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు పేసర్ షానవాజ్ దహాని పక్కటెముకల గాయంతో భారత్‌తో ఆదివారం జరిగే మ్యాచ్‌కు దూరమయ్యాడు. శుక్రవారం హంగ్ కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో షానవాజ్ దహని గాయపడ్డాడు. ఈ విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. గాయం తీవ్రతను బట్టి రిపోర్ట్‌లు వచ్చాక.. అతను టోర్నీలో కొనసాగుతాడా లేక మొత్తం దూరమవుతాడా? అన్న విషయంపై క్లారిటీ రానుంది.
JUST IN: Shahnawaz Dahani is out of the Asia Cup Super 4 game against India due to a suspected side strain pic.twitter.com/mxBBtAJYOi
— ESPNcricinfo (@ESPNcricinfo) September 3, 2022
తొలి మ్యాచ్ ఓడిన పాక్.. ఈ మ్యాచులో ఎలాగైనా గెలిచి.. రోహిత్ సేనపై ప్రతీకారం తీర్చుకోవాలని పాక్ భావిస్తోంది. ఈ తరుణంలో ఇది గట్టి ఎదురుదెబ్బ అని చొప్పొచ్చు. లీగ్ మ్యాచులో భారత్‌తో.. బౌలింగ్‌లో పెద్దగా ప్రభావం చూపని దహాని.. బ్యాటింగ్‌లో సత్తా చాటాడు. చివర్లో ధాటిగా ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఇక హాంగ్ కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో షానవాజ్ దహాని అద్భుత బౌలింగ్ చేశాడు. షానవాజ్ గైర్హాజరీలో మహమ్మద్ హస్నైన్, హసన్ అలీలో ఒకరు తుది జట్టులోకి రానున్నారు. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
SUPER FOUR action begins🔨#AsiaCup2022 pic.twitter.com/jIADgpRx75
— CricTracker (@Cricketracker) September 3, 2022