రేపటి నుండి ప్రారంభం కానున్న ఆసియా కప్ టోర్నీ కంటే.. ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ గురించే సర్వత్రా చర్చ నడుస్తోంది. అనేకానేక కారణాల వల్ల దాయాది దేశాలు కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడనుండడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ పోరులో గెలిచి టీ20 వరల్డ్ కప్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా భావిస్తుండగా, అదే సీన్ ను మరోసారి రిపీట్ చేయాలని పాకిస్తాన్ ఉవ్విళ్లూరుతోంది. ఈ తరుణంలో పాకిస్థాన్‌తో తలపడబోయే భారత జట్టులో ఎవరికి చోటు దక్కుతుందో అన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఎవరకి నచ్చినట్లు వారు, ఇదే ప్లేయింగ్ 11 అని ప్రకటిస్తున్నారు. తాజాగా భారత మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా తన ప్లేయింగ్ 11ను ప్రకటించారు.
పాకిస్తాన్ పై భారత్ గెలవాలంటే ఎవరినీ జట్టులోకి తీసుకోవాలో ప్రెడిక్ట్ చేసిన సునీల్ గవాస్కర్, ఆశ్చర్యకరంగా ముగ్గురు స్పిన్నర్లకు తుది జట్టులో స్థానం కల్పించాడు. గవాస్కర్ పేర్కొన్న 11 మంది లిస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఓపెనర్లు కాగా, విరాట్ కోహ్లీ 3 స్థానంలో ఆడటం ఖాయం. 4వ స్థానంలో సూర్యకుమార్ యాదవ్, 5వ స్థానంలో రిషబ్ పంత్ ను పేర్కొన్నాడు. ఇక.. 6వ స్థానంలో స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు, 7వ స్థానంలో మరో ఆల్ రౌండర్ రవీంద్రా జడేజాకు చోటిచ్చాడు. ఇక, బౌలర్లుగా.. యూఏఈ స్లో పిచ్ లను బట్టి అశ్విన్, చాహల్‌లను తుది జట్టులో ఉంచాలని సూచించాడు. దీంతో జడేజా, అశ్విన్, చాహల్.. ముగ్గురు సిన్నర్లు జట్టులో ఉంటున్నారు. ఇక, మిగిలిన రెండు స్లాట్లలో పేసర్లయిన భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్‌లను తీసుకున్నాడు.
ఆల్ రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా, జడేజా ఇద్దరికీ చోటు కల్పించడంతో.. ఇక్కడ దినేష్ కార్తీక్ స్థానం గల్లంతయింది. భారత స్టార్ ఫినిషర్ అని పేరున్న దినేష్ కార్తీక్‌కు జట్టులో చోటు దక్కే వీలు లేకుండా పోయింది. ఒకవేళ కార్తీక్‌ను జట్టులోకి తీసుకోవాలంటే ఒక బౌలర్‌ను త్యాగం చేయాల్సి ఉంటుంది. అందువల్ల అతన్ని తన ప్లేయింగ్ 11లో పేర్కొనలేదు. అలాగే.. అవేశ్ ఖాన్, దీపక్ హుడా, రవి బిష్ణోయ్ బెంచ్ కే పరిమితం కానున్నారు. సునీల్ గవాస్కర్ ప్రెడిక్ట్ 11పై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
సునీల్ గవాస్కర్ ప్రెడిక్ట్ 11: (భారత జట్టు)
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్.