ఆసియా కప్ 2022లో భాగంగా మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా పరాజయం పాలైంది. గ్రూప్ స్టేజ్‌లో రెండు వరుస విజయాలతో జోరు చూపించిన భారత్.. సూపర్ ఫోర్‌లో మాత్రం చేతులెత్తేసింది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో ఓడిన టీమిండియా.. తాజాగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోనూ ఓడి ఫైనల్ అవకాశాలను గల్లంతు చేసుకుంది. కాగా.. ఈ మ్యాచ్‌లో ఒక ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కొట్టిన భారీ సిక్స్.. సెక్యూరిటీ సిబ్బంది బ్యాక్‌కు గట్టిగా తగిలింది. ఆ సెక్యూరిటీ పర్సన్ ప్రేక్షకుల వైపు తిరిగి డ్యూటీ చేస్తుండగా.. రోహిత్ కొట్టిన షాట్‌ను గమనించలేదు. దీంతో డైరెక్ట్‌గా వెళ్లి బంతి అతని వెనుక వైపు తగిలింది. ఆ దెబ్బకు అతను ఉలిక్కి పడ్డాడు. దీంతో అక్కడున్న మిగతా సెక్యూరిటీ సిబ్బంది నవ్వుకున్నారు. ఈ ఫన్నీ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసితా ఫెర్నాండో వేసిన 10 ఓవర్‌లో డీప్ బ్యాక్‌వార్డ్ స్క్వేర్ లెగ్ వైపు రోహిత్ భారీ సిక్స్ కొట్టిన సమయంలో ఈ ఘటన చేసుకుంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 173 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 41 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 72 పరుగులు చేసి అదరగొట్టాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ తర్వాతగానే అవుట్ అయినా.. సూర్యకుమార్‌తో కలిసి ఇన్నింగ్స్ నిలబెట్టాడు. రోహిత్‌కు సపోర్ట్‌గా సూర్యకుమార్ యాదవ్ 29 బంతుల్లో ఫోర్, సిక్సర్‌తో 34 పరుగులు చేసి రాణించాడు. మరోసారి మిడిలార్డర్ బ్యాటర్లు హార్దిక్ పాండ్యా(17), పంత్(17), దీపక్ హుడా(3) దారుణంగా విఫలమయ్యారు. చివరి ఓవర్‌లో ఒక సిక్స్‌తో అశ్విన్(15) పర్వాలేదనిపించాడు. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుషంకా 3, చమిక కరుణరత్నే, డసన్ షనక చెరో రెండు వికెట్లు పడగొట్టారు. మహీష్ థీక్షణ ఓ వికెట్ పడగొట్టాడు.
బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై శ్రీలంక 174 లక్ష్యఛేదనను ధాటిగా ఆరంభించింది. పేస్ బౌలింగ్ పనిచేయకపోయినా.. రోహిత్ పవర్ ప్లేలో ముగ్గురు పేసర్లను ప్రయోగించి లంకకు మేలు చేశాడు. దీంతో ఓపెనర్లు నిస్సంకా(37 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 52), కుసల్ మెండిస్(37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 57) అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ఓపెనర్లు అవుట్ అయిన తర్వాత కాస్త తడబడిన శ్రీలంక మ్యాచ్ మాత్రం కైవలం చేసుకుంది. టీమిండియా బౌలర్లలో చాహల్ 3, అశ్విన్ ఒక వికెట్‌తో రాణించారు. కాగా.. శ్రీలంక 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా.. ఈ ఓటమితో టీమిండియా ఆసియా కప్ ఫైనల్ చేరే అవకాశాలు సంక్లిష్టంగా మారిపోయాయి. మరి ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ సిక్స్ సెక్యూరిటీకి తగిలిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: శ్రీలంకతో మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి 5 ప్రధాన కారణాలు!
— Yoloapp (@Yoloapp2) September 6, 2022