నేటి(శనివారం ఆగస్ట్ 27) నుంచి ప్రారంభం అవుతున్న ఆసియా కప్ నేపథ్యంలో క్రికెట్ ఫీవర్ ఎక్కేసింది. పైగా ఆదివారం(ఆగస్ట్ 28) ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ కోసమైతే క్రికెట్ అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో తలపడిన భారత్-పాకిస్థాన్.. మళ్లీ ఇప్పుడే ఢీకొంటున్నాయి. సాధారణంగానే ఇండియా-పాకిస్థాన్ అంటే భారీ క్రేజ్ ఉంటుంది. సగటు క్రికెట్ అభిమాని సైతం ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ అంటే ప్రత్యేకమైన ఇంట్రస్ట్ చూసిస్తాడు. ఇప్పుడు ఆసియా కప్‌లో కూడా అలాంటి హైపే క్రియేట్ అయింది. అటు ఇరు దేశాల ఆటగాళ్లు సైతం ఈ మ్యాచ్‌ను చాలా సిరీస్‌గా తీసుకున్నట్లు కనిపిస్తున్నారు.
టీ20 వరల్డ్ కప్‌లో పాక్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా.. మరోసారి భారత్‌ను ఓడించాలని పాకిస్థాన్ వ్యూహాలు రచిస్తున్నాయి. అందుకు తగ్గట్లు రెండు రోజుల క్రితమే యూఏఈ చేరుకున్న ఇరు జట్ల ఆటగాళ్లు.. ప్రాక్టీస్‌లో మునిగి తేలుతున్నారు. ఈ నెట్ సెషన్స్‌లో ఆటగాళ్ల ప్రాక్టీసే కాకుండా.. కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మైదానంలో ప్రత్యుర్థులై కొదమసింహాల్లా తలపడే భారత్-పాక్ ఆటగాళ్లు.. ప్రాక్టీస్ సమయంలో ఒకరినొకరు పలకరించుకుంటూ చాలా సరదా సరదా గడిపారు. అలాగే ఆటగాళ్లను చూసేందుకు అభిమానులు ఎగబడుతున్నారు. వారి ఉత్సహాన్ని, అభిమానాన్ని కాదనలేక టీమిండియా ఆటగాళ్లు సైతం వారితో సెల్ఫీలు దిగుతున్నారు. ముఖ్యంగా పాకిస్థాన్ అభిమానులు టీమిండియా ఆటగాళ్లను కలిసేందుకు, వారితో ఫొటోలు దిగేందుకు ఎగబడుతున్నారు.
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మకు పాకిస్థాన్‌లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. యూఏఈలోనూ పాకిస్థాన్ అభిమానులు కోహ్లీ, రోహిత్‌ను కలిసేందుకు ఉవ్విళ్లురుతున్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్‌కు చెందిన తన అభిమానికి రోహిత్ శర్మ జీవితాంతం గుర్తిండిపోయేలా హగ్ ఇచ్చాడు. అది కూడా ఫెన్సింగ్ అవతల నుంచి రెండు చేతులు చాపి.. హగ్ అడిగిన ఫ్యాన్ కోసం.. రోహిత్ శర్మనే స్వయంగా వెళ్లి కంచె అడ్డుగా ఉన్నా కూడా హగ్ ఇచ్చాడు. దాంతో ఆ పాక్ అభిమాని తెగ సంబురపడిపోయాడు. ఇలా పాకిస్థాన్‌కు చెందిన తన అభిమానులకు రోహిత్ శర్మ హగ్ ఇచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ఎవరికి భయపడని నేను.. అతని కోపానికి మాత్రం వణికిపోతా: రిషభ్ పంత్
What a beautiful gesture from #RohitSharma with Pakistani fans asking for a hug, @ImRo45 stepped out of the ground and went and greeted them ! #INDvsPAK #INDvPAK #AsiaCup2022 #PakVsIndpic.twitter.com/v9hensAB9d
— Muhammad Faizan (@KhanFaizan645) August 26, 2022
📺Watch📺- @imVkohli ‘s Pakistani fan gets the surprise of his life😍👇#CricWickStories #Kohli #Pakistan #AsiaCup2022 #AsiaCupT20 #AsiaCup #CricketTwitter #ViratKohli https://t.co/fjCahld8gs
— CricWick Stories (@StoriesCW) August 26, 2022