ఆసియా కప్ ప్రారంభానికి ముందు మనది హాట్‌పేవరేట్ టీమ్.. ఒక్క పాకిస్థాన్ తప్పితే మనకు పోటీ ఇచ్చే టీమే కనిపించలేదు. ఈ ఊహలకు తగ్గట్లే గ్రూప్ స్టేజ్‌లో టీమిండియా చెలరేగింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై విజయం సాధించి.. కాలర్ ఎగరేసింది. తర్వాత పసికూన హాంకాంగ్‌ను ఓడించి సూపర్ ఫోర్‌కు చేరింది. టీమిండియాతో పాటు పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్, శ్రీలంక కూడా సూపర్ ఫోర్‌కు చేరాయి. ఈ మూడు జట్లలో ఇప్పటికే పాకిస్థాన్ ఓడించాం, అఫ్ఘనిస్థాన్, శ్రీలంక మన ముందు బచ్చాలని భావించాం. కానీ.. వారం తిరిగేసరికీ.. ఆసియా కప్ నుంచి ఇంటిదారి పట్టేందుకు రెడీ అయ్యింది. శ్రీలంకతో మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే భారీ షాక్ తగిలింది.
6 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ అంపైర్ తప్పుడు నిర్ణయంతో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ వెంటనే విరాట్ కోహ్లీ డకౌట్‌గా అవుట్ అవ్వడంతో 13 పరుగులకే భారత్ రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ.. కెప్టెన్ రోహిత్ శర్మ(72) పవర్ హిట్టింగ్‌తో శ్రీలంక బౌలర్లపై ఎదురుదాడికి దిగి.. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రోహిత్‌కు సూర్యకుమార్ యాదవ్(34) చక్కటి సహకారం అందించడంతో టీమిండియా తిరిగి పుంజుకుంది. కానీ.. సూర్యకుమార్, రోహిత్ అవుట్ అయిన తర్వాత.. శ్రీలంక బౌలర్లు పట్టుసాధించారు. హార్దిక్ పాండ్యా(17), పంత్(17), దీపక్ హుడా(3)ను వెంటవెంటనే పెవిలియన్‌కు పంపి టీమిండియా భారీ స్కోర్ చేయకుండా నిలువరించారు. చివరి ఓవర్‌లో అశ్విన్(15) ఒక సిక్స్‌తో టీమిండియాకు మూమెంటంట్ అందించే ప్రయత్నం చేశాడు. దీంతో భారత్ శ్రీలంక ముందు 174 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక ఓపెనర్లు తొలి రెండు ఓవర్లు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డా.. తర్వాత చెలరేగి ఆడారు. 12వ ఓవర్ వరకు వికెట్ ఇవ్వకుండా.. ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకుని మ్యాచ్‌ను టీమిండియాకు దూరం చేశాడు. వీరిద్దరూ అవుటైన తర్వాత యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్ శ్రీలంక బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. చాహల్ 3, అశ్విన్ ఒక వికెట్‌తో మ్యాచ్‌ను చివరి ఓవర్ వరకు తీసుకెళ్లారు. 12 బంతుల్లో 21 పరుగులు అవసరమైన సమయంలో కెప్టెన్‌గా రోహిత్ చేసిన ఘోర తప్పిదం టీమిండియా కొంప ముంచింది. పాకిస్థాన్‌పై ఇలాంటి సిచ్చువేషన్ వచ్చినపుపడు భువనేశ్వర్‌కు 19వ ఓవర్ ఇచ్చి చేతులు కాల్చుకున్న రోహిత్.. శ్రీలంకతోనూ మళ్లీ అదే తప్పు చేశాడు. 21 పరుగులు డిఫెండ్ చేయాల్సిన సమయంలో భువీ.. 19వ ఓవర్‌లో ఏకంగా 16 పరుగులు ఇవ్వడంతో శ్రీలంక విజయం లాంఛనమవుతుంది. చివరి ఓవర్‌లో కావాల్సిన 7 పరుగులను సాధించి లంక విజయం సాధించింది. కాగా.. 19వ ఓవర్ భువీ కాకుండా అర్షదీప్‌కు ఇచ్చి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని, ఇది కచ్చితంగా కెప్టెన్‌గా రోహిత్ శర్మ తప్పిదమని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు.
అలాగే పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో మంచి ప్రదర్శన కనబర్చిన రవి బిష్ణోయ్‌ని పక్కన పెట్టి చాహల్‌ను కొనసాగించడం కూడా కెప్టెన్‌గా రోహిత్ వైఫల్యాన్ని సూచిస్తోంది. అలాగే దినేష్ కార్తీక్‌ను కాకుండా దీపక్ హుడాను ఫినిషర్ రోల్‌లో ఆడించడం, అక్షర్ పటేల్‌ను తీసుకోకుండా అశ్విన్‌ను తుది జట్టులోకి తీసుకోవడం రోహిత్ బ్యాడ్ కెప్టెన్సీకి నిదర్శనమని క్రికెట్ ఫ్యాన్స్ సైతం మండిపడుతున్నారు. అలాగే బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై పేసర్లు రాణించలేకపోతున్నా.. పవర్ ప్లేలో అశ్విన్‌తో బౌలింగ్ చేయించకపోవడంపై టీమిండియా కొంపముంచింది. ఇలా రోహిత్ శర్మ కెప్టెన్‌గా చేసిన తప్పులు ఆసియా కప్‌లో టీమిండియా చెత్త ప్రదర్శనకు కారణం అవుతున్నాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ఎవరు గమనించలేదు.. టీమిండియాకి అసలైన దెబ్బ రెండో ఓవర్లోనే!
Captain Rohit Sharma is not having a great year.
Can he turn the tables in #T20WorldCup2022?
📸: Disney+Hotstar pic.twitter.com/203h2hhur2
— CricTracker (@Cricketracker) September 6, 2022
Jokes apart but this is how you treat youngsters? Imagine being a captain and insulting your bowler like this during a live and crucial match. Shame on rohit sharma.pic.twitter.com/yoaAR1XWES
— Saith Abdullah (@SaithAbdullah99) September 6, 2022