ఆసియా కప్ 2022లో భాగంగా సూపర్ ఫోర్‌లో టీమిండియా వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. గ్రూప్ స్టేజ్‌లో రెండు వరుస విజయాలతో దూకుడు చూపించిన భారత్‌కు సూపర్ ఫోర్‌లో ఏమాత్రం కలిసిరావడం లేదు. మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో దారుణ పరాజయాన్ని చవిచూసింది. దీంతో ఆసియా కప్ ఫైనల్ అవకావలు పూర్తిగా సన్నగిల్లాయి. కాగా.. శ్రీలంకతో ఓటమి కంటే మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రవర్తించిన తీరుపైనే ఎక్కువగా విమర్శలు వస్తున్నాయి. మ్యాచ్ చివరి అంకంలో భారీ ఒత్తిడి సమయంలో టీమిండియా యంగ్ బౌలర్ అర్షదీప్ సింగ్‌తో రోహిత్ ప్రవర్తించిన తీరు సరికాదంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అసలు విషయం ఏంటంటే.. శ్రీలంకతో మ్యాచ్ చివరి ఓవర్ వరకు సాగింది. 174 పరుగుల లక్ష్యాన్ని రక్షించే క్రమంలో ఇన్నింగ్స్ ఆరంభంలో టీమిండియా బౌలర్లు విఫలం అయినా.. 12వ ఓవర్ తర్వాత శ్రీలంకను కొంత ఇబ్బందిపెట్టి మ్యాచ్‌ను చివరి ఓవర్ వరకు తీసుకెళ్లారు. కానీ.. 19వ ఓవర్‌లో భువనేశ్వర్ కుమార్ ఏకంగా 16 పరుగులు ఇవ్వడంతో మ్యాచ్ లంక చేతుల్లోకి వెళ్లిపోయింది. చివరి ఓవర్‌లో కేవలం 7 పరుగులు మాత్రం వారికి అవసరం అయ్యాయి. అయినా కూడా యంగ్ బౌలర్ అర్షదీప్ ఆ 7 పరుగులను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ.. ఆ సమయంలో రోహిత్ శర్మ దారుణంగా ప్రవర్తించాడు. ఫీల్డ్ సెట్ గురించి అర్షదీప్ ఏదో చెబుతుండగా.. చాలా చిరాగ్గా వినకుండా పక్కకు వెళ్లిపోతాడు. బిత్తర పోయిన అర్షదీప్ బిక్కమొహంతో అలాగే చెప్తుంటాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
‘జట్టు కెప్టెన్‌గా ఉన్న నువ్వు.. తీవ్ర ఒత్తిడి సమయంలో ఒక యంగ్ బౌలర్‌తో ఇలాగేనా ప్రవర్తించేది’ నెటిజన్లు, క్రికెట్ అభిమానులు రోహిత్ శర్మపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం 7 పరుగులను డిఫెండ్ చేసేందుకు యువ బౌలర్ ప్రయత్నిస్తుంటే అతనికి విలువైన సలహాలు, సుచనలు ఇవ్వడం అతను చెప్పింది విని అర్థం చేసుకోవడం మానేసి.. ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తే.. ఎలా అంటూ క్రికెట్ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. గతంలో ఒక సారి భువనేశ్వర్ విషయంలో అనుచితంగా ప్రవర్తించి రోహిత్ విమర్శల పాలైన విషయం తెలిసిందే. మళ్లీ ఇప్పుడు అర్షదీప్ విషయంలో రోహిత్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 173 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 41 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 72 పరుగులు చేసి అదరగొట్టాడు. మిడిలార్డర్ బ్యాటర్లు హార్దిక్ పాండ్యా(17), పంత్(17), దీపక్ హుడా(3) దారుణంగా విఫలమయ్యారు. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుషంకా 3, చమిక కరుణరత్నే, డసన్ షనక చెరో రెండు వికెట్లు పడగొట్టారు. మహీష్ థీక్షణ ఓ వికెట్ పడగొట్టాడు. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై శ్రీలంక 174 లక్ష్యఛేదనను ధాటిగా ఆరంభించింది. పేస్ బౌలింగ్ పనిచేయకపోయినా.. రోహిత్ పవర్ ప్లేలో ముగ్గురు పేసర్లను ప్రయోగించి లంకకు మేలు చేశాడు.
దీంతో ఓపెనర్లు నిస్సంకా(37 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 52), కుసల్ మెండిస్(37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 57) అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ఓపెనర్లు అవుట్ అయిన తర్వాత కాస్త తడబడిన శ్రీలంక మ్యాచ్ మాత్రం కైవలం చేసుకుంది. టీమిండియా బౌలర్లలో చాహల్ 3, అశ్విన్ ఒక వికెట్‌తో రాణించారు. కాగా.. శ్రీలంక 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్‌లో అర్షదీప్‌తో రోహిత్ శర్మ ప్రవర్తించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Abay bat to suno bicharay ki pic.twitter.com/KBJkEIXD01
— samia (@samiaa056) September 6, 2022