ఆసియా కప్ 2022లో టీమిండియా నేడు(మంగళవారం సెప్టెంబర్ 6) కీలకమైన మ్యాచ్ ఆడనుంది. సూపర్ ఫోర్ తొలి మ్యాచ్‌లో పాక్‌పై ఓడిన టీమిండియా.. శ్రీలంకపై కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. శ్రీలంకపై గెలిస్తేనే టీమిండియాకు ఫైనల్ అవకాశాలు మెరుగువుతాయి. గ్రూప్ స్టేజ్‌లో పాకిస్థాన్, హాంకాంగ్‌ను ఓడించిన భారత్.. సూపర్ ఫోర్‌లో మాత్రం పాక్ చేతిలో ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌తో టీమిండియాపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా బౌలింగ్ విభాగం సరిగా లేదంటూ సర్వత్రా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో టీమిండియా క్రికెటర్ చతేశ్వర్ పుజారా స్పందించాడు. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గాయంతో ఆసియా కప్‌కు దూరం కావడంతో జట్టు కూర్పు కష్టంగా మారినట్లు తాను భావిస్తున్నానని పుజారా తెలిపాడు.
కాగా.. శ్రీలంకతో మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను జట్టులోకి తీసుకోవాలని పుజారా సూచించాడు. కాగా.. టీమిండియాకు మూడో పేసర్ అవరసం ఎంతైనా ఉందని పుజారా అభిప్రాయపడ్డాడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బాగానే బౌలింగ్ చేస్తున్నా.. ప్రతిసారి అతనితో పని కాదని పుజారా అన్నాడు. మూడో స్పెషలిస్ట్ బౌలర్‌కు తోడు ఒక స్పిన్నర్.. ఇద్దరు ఆల్‌రౌండర్లు(హార్దిక్‌పాండ్యా, అక్షర్ పటేల్) జట్టులో ఉండాలని పుజారా సూచించాడు. కాగా.. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా కేవలం నలుగురు స్పెషలిస్ట్ బౌలర్లతోనే బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అందులో భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. 4 ఓవర్ల కోటా పూర్తి చేసిన ఆల్‌రౌండర్ పాండ్యా భారీగా పరుగులు ఇచ్చుకున్నాడు. దీంతో టీమిండియా గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడింది.
తొలుత బ్యాటింగ్ చేసి 181 పరుగుల టఫ్ టార్గెట్ ఇచ్చినా.. పాకిస్థాన్‌ను టీమిండియా బౌలర్లు నిలువరించలేకపోయారు. యువ లెగ్‌స్పిన్నర్ రవి బిష్ణోయ్ కాస్త పర్వాలేదనిపించాడు. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు యువ పేసర్ హర్షల్ పటేల్ గాయాలతో ఆసియా కప్ దూరమవ్వడంతో టీమిండియా బౌలింగ్ ఎటాక్ కొంచెం వీకైన మాట వాస్తవం. అలాగే మరో స్టార్ బౌలర్ మొహమ్మద్ షమీని ఎంపిక చేయకపోవడం కూడా భారత బౌలింగ్ విభాగాన్ని బలహీన పర్చింది. మరి అక్షర్ పటేల్‌ను తుది జట్టులోకి తీసుకోవాలనే పుజారా సూచనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ఆసియా కప్ విన్నర్ ఎవరో చెప్పేసిన సెహ్వాగ్! ఇండియా అయితే కాదు..
“I think Akshar Patel should come in. I still feel that we need to change our team. This combination isn’t working for us,” @cheteshwar1 said. #SLvIND #AsiaCup #AsiaCup2022 https://t.co/p9owrjbq4r
— Circle of Cricket (@circleofcricket) September 6, 2022