భారత్ తో పాటు సరిహద్దు దేశాల్లో ఎక్కువగా ఆడే ఆట క్రికెట్. పిల్లాడి నుంచిపెద్దవాళ్ల వరకు క్రికెట్ గురించి దాదాపు తెలుసుకుంటారు. రూల్స్ తెలిసే ఉంటాయి. ఆడటం రాకపోయినా సరే చూస్తూ అయినా సరే ఎంజాయ్ చేస్తుంటారు. మనలాంటి సాధారణ వ్యక్తులకే ఈ ఆట గురించి కొద్దో గొప్పో తెలుసు. కానీ పాక్ జట్టు మహిళా క్రికెటర్లు మాత్రం తమ చెత్త ఫీల్టింగ్ తో ట్రోల్స్ కి గురవుతున్నారు. ప్రస్తుతం వీడియో వైరల్ గా మారడంతో ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బంగ్లాదేశ్ వేదికగా మహిళల ఆసియాకప్ జరుగుతోంది. ఈ టోర్నీలోని పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. పాక్ జట్టు రెండో ప్లేసులో ఉంది. అయితే తాజాగా పాక్-యూఈఏ జట్ల మధ్య ఆదివారం జరిగింది. ఇందులో ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. మనం గతంలో చూసిన హ్యాపీడేస్, లగాన్ సినిమాల్లో ఫీల్డర్లు.. క్రికెట్ తెలీక బౌండరీ అవతలకు వెళ్లి క్యాచ్ పడతారు. దీంతో కెప్టెన్ వచ్చి వారిని మందలిస్తాడు. అలా కాదు లైన్ కి లోపల వైపు నిల్చుని క్యాచ్ పట్టాలని చెబుతాడు.
కానీ ఆదివారం జరిగిన మ్యాచులో మాత్రం పాక్ జట్టు ఫీల్డింగ్ చేస్తున్న టైంలో యూఏఈ బ్యాటర్ బలంగా బంతిని కొట్టింది. చాలా కష్టపడి ఆ బంతి ఆపిన ఓ ఫీల్డర్.. తాడు వైపు బాల్ రావడం చూసి, బౌండరీ అవతల వైపు నుంచి చేతులుపెట్టి మరీ బంతిని ఆపింది. దీంతో నెటిజన్స్ తెగ ట్రోలింగ్ చేస్తున్నారు. మహిళ క్రికెటర్ల విజువల్ కి మేల్ క్రికెటర్లు నవ్వుతున్న విజువల్ జతచేసి ట్రోల్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ మ్యాచులో పాక్ 71 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక ఈ టోర్నీ ఫైనల్ అక్టోబరు 15న జరగనుంది. మరి పాక్ క్రికెటర్ల ఫీల్డింగ్ మీకెలా అనిపించింది. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.