ఆసియా కప్ తొలి మ్యాచ్‌లోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై విజయంతో టీమిండియా ఆటగాళ్లు ఫుల్‌జోష్‌లో ఉన్నారు. గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో ఇదే పాకిస్థాన్ చేతిలో ఎదురైన పరాభవానికి టీమిండియా బదులు తీర్చుకున్నట్లు అయింది. హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శనకు తోడు టీమిండియా బౌలర్లు అర్షదీప్ సింగ్, ఆవేశ్ ఖాన్ మంచి బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు. పాక్‌తో మ్యాచ్‌లో అర్షదీప్ రెండు, ఆవేశ్ ఖాన్ ఒక వికెట్ తీసుకున్నారు. పాక్‌పై విక్టరీని ఈ ఆటగాళ్లు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆసియా కప్‌లో టీమిండియా తమ తర్వాతి మ్యాచ్ పసికూన హాంకాంగ్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత ఆటగాళ్లు సరదాగా గడుపుతున్నారు.
ఈ క్రమంలోనే అర్షదీప్, ఆవేశ్ ఖాన్ ఒక గేమ్ ఆడారు. టేబుల్ టెన్నిస్ టేబుల్‌పై ఒక వైపు వాటర్ గ్లాస్‌లను పెట్టి.. మరోవైపు నుంచి ప్లాస్టిక్ బంతులను ఆ గ్లాస్‌లలో వేయాలి. మొత్తం పది బంతుల్లో ఎవరెన్ని ఎక్కువ బంతులు వేస్తే వారే విన్నర్. ఈ గేమ్‌లో తొలుత ఆవేశ్ ఖాన్ బంతులు వేయగా.. పదిలో ఒకే ఒక బంతి గ్లాస్‌లో పడుతుంది. తర్వాత.. అర్షదీప్ తొలి బంతినే గ్లాస్‌లో వేసి.. స్కోర్‌ను సమం చేశాడు. కానీ గెలిచేందుకు మరో బంతి గ్లాస్‌లో పడాలి.. ఈ క్రమంలో ఒక బంతి గ్లాస్‌లో పడి గ్లాస్‌కూడా ఒరిగిపోతుంది. దీన్ని కౌంట్‌లోకి తీసుకోడు.. అంపైర్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్. వీరిద్దరి మధ్య పోటీకి అతనే న్యాయనిర్ణేతగా ఉన్నాడు.
చివరికి పదిలో రెండు బంతులను అర్షదీప్ గ్లాసుల్లో వేసి గెలిచాడు. అంపైర్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ నేను ముందే చెప్పానుగా అర్షదీప్ రెండు పాయింట్లతో గెలుస్తాడని.. ఎందుకంటే అతని జెర్సీ నంబర్ కూడా రెండే అంటూ అర్షదీప్ జెర్సీ నంబర్‌ను చూపిస్తాడు. అతని చేయి పైకెత్తి విన్నర్‌గా ప్రకటిస్తాడు. అర్షదీప్ సింగ్, ఆవేశ్ ఖాన్ మధ్య జరిగిన ఈ పోటీ వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఈ గేమ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: వీడియో: ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ తర్వాత ఏడుస్తూ గ్రౌండ్ వీడిన పాక్ పేసర్
𝐀𝐯𝐞𝐬𝐡 🆚 𝐀𝐫𝐬𝐡𝐝𝐞𝐞𝐩 🤜🤛
A fun off-the-field battle, ft. our pacers @Avesh_6 & @arshdeepsinghh! 😀 👌
You wouldn’t want to miss 👍 👍
P.S. – @surya_14kumar gets his prediction spot on 🎯#TeamIndia | #AsiaCup2022 pic.twitter.com/AoL6HGf2Yu
— BCCI (@BCCI) August 30, 2022