Pakistan vs Sri Lanka: యూఏఈ వేదికగా జరిగిన ఆసియా కప్ 2022 టోర్నీలో శ్రీలంక విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన లంకేయులు అంచనాలకు మించి రాణించి కప్పు కైవసం చేసుకున్నారు. టోర్నీ తొలి మ్యాచులో ఓడినా.. ఆపై మ్యాచ్ మ్యాచ్‌కు మెరుగవుతూ ఆరోసారి చాంపియన్‌గా అవతరించింది. పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్ పోరులో 23 పరుగులతో విజయం సాధించి కప్‌ను సొంతం చేసుకుంది. అయితే.. ఈ విజయం వెనుక ఒక సీక్రెట్ కోడ్ ఉందన్న వార్తలు చక్కర్లుకొడుతున్నాయి. అలాంటి సిగ్నల్స్ డ్రెస్సింగ్ రూమ్ నుంచే రావడం గమనార్హం. ఇంతకీ ఆ సీక్రెట్ కోడ్స్ ఏంటి? ఎవరు పంపారు? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఆసియా కప్ ఫైనల్ పోరులో శ్రీలంక విజేతగా నిలిచినా.. ఇప్పుడు ఆ విజయమే వారిని మరింత చిక్కుల్లో పడేస్తోంది. సీక్రెట్ కోడ్స్ తో లంకేయులు చీట్ చేశారంటూ వార్తలు పుట్టుకొస్తున్నాయి. టోర్నీ తొలిపోరులో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో దారుణ ఓటమిని చవిచూసిన శ్రీలంక.. ఆపై పుంజుకున్న తీరు అమోఘం. భారత్, పాకిస్తాన్, రుస విజయాలతో ఆరోసారి ఆసియా ఖండంలో ఛాంపియన్ గా అవతరించింది. ఇక్కడివరకు బాగానే ఉన్నా.. శ్రీలంక కోచ్ క్రిస్ సిల్వర్ వుడ్ పంపిన ‘సీక్రెట్ కోడ్స్’పై పెద్ద చర్చ నడుస్తోంది. మ్యాచుపై పట్టు కోల్పోతున్న ప్రతి సందర్భలోనూ క్రిస్ వుడ్ ఇదే తరహా సిగ్నల్స్ పాస్ చేయడం గమనార్హం. 2D, D5, 4A, 4C, B4.. ఆల్ఫాబెట్, న్యూమరికల్ కలగలిపిన ఈ కోడింగ్ ఫార్మాట్ ఏంటా అన్నది! ఎవరకి అంతు చిక్కడం లేదు.
సిల్వర్ వుడ్ పంపిన ‘సీక్రెట్ కోడ్స్’ ను అమరుపరచడంలో శ్రీలంక సారధి డాసన్ శనక విజయవంతం అయ్యాడనే చెప్పాలి. కొందరేమో దీన్ని చీటింగ్ అంటుండగా, మరికొందరేమో ఇదొక స్ట్రేటజీ అంటూ కితాబిస్తున్నారు. గతంలో ఇంగ్లాండ్ కోచ్ గా పనిచేసిన క్రిస్ సిల్వర్ వుడ్.. అక్కడ కూడా ఇలానే సీక్రెట్ కోడ్స్ పంపేవాడట. యాషెస్ సిరీస్ లో ఆస్ట్రేలియా చేతిలో దారుణ ఓటమితో ఆ బాధ్యతల నుంచి తప్పుకున్న సిల్వర్ వుడ్, శ్రీలంక కోచ్ నియమితుడై.. లంకేయులలో ఆత్మ విశ్వాసాన్ని నింపి విజేతగా నిలిపాడు.
కుమార సంగర్కర, మహేళ జయవర్దనే, తిలకరత్నే దిల్షాన్, లసిత్ మలింగా.. వంటి దిగ్గజ ఆటగాళ్లందరూ ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించడంతో శ్రీలంక మనుగడ జట్టు మనుగడ కోల్పోయిన మాట వాస్తవం. స్వదేశం, విదేశం అనే తేడా లేకుండా.. ఆఖరికు పసికూన జట్ల చేతిలో కూడా వరుస ఓటములు చువిచూసింది. ఈ తరుణంలో శ్రీలంక జట్టు.. భారత్, పాకిస్తాన్ లాంటి బలమైన జట్లను ఓడించగలదా? అన్న సందేహం టోర్నీ ప్రారంభానికి ముందు అందరిలోనూ ఉండేది. అలాంటి అనుమానాలను పటాపంచలు చేస్తూ.. ఆసియా ఖండంలో రారాజుగా నిలిచింది. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.