ఆసియాకప్ ముంగిట పాకిస్తాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే మోకాలి గాయంతో స్టార్ పేసర్ షాహిన్ అఫ్రిది దూరం కాగా.. తాజాగా ఆ జట్టు యువ బౌలర్ మహ్మద్ వసీమ్ వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. దీంతో ఆదివారం ఇండియాతో జరగబోయే మ్యాచ్ కు, అతను తుది జట్టుకు అందుబాటులో ఉండటం కష్టమనే వాదన వినిపిస్తోంది. ఆ వివరాలు..
ఆసియా కప్ ముంగిట గాయాల బెడద అన్ని జట్లను కలవపెడుతోంది. ఇప్పటికే.. జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్, షాహీన్ అఫ్రిదీ, దుష్మంత చమీరా.. వంటి కీలక ఆటగాళ్లు గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యారు. ఇప్పుడు మరో ఆటగాడు వెన్నునొప్పి కారణంగా దూరమవ్వనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రాక్టీస్ సమయంలో బౌలింగ్ సెషన్‌లో పాల్గొన్న మహ్మద్ వసీమ్ బౌలింగ్ చేస్తున్న సమయంలో వెన్నునొప్పి వచ్చినట్లు తెలుస్తోంది. వెంటనే జట్టు సిబ్బంది అతన్ని ఐసీసీ అకాడమీకి తరలించి ఎంఆర్‌ఐ స్కాన్ చేయించగా, వెన్నునొప్పి తీవ్రంగానే ఉన్నట్లు తేలింది. దీంతో ఆదివారం జరగబోయే ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ కు అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది.
ఆసియా కప్ ముగిసిన తర్వాత కూడా పాకిస్తాన్‌కు బిజీ షెడ్యూల్ ఉంది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో వరుస సిరీస్‌లు ఆడనుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్‌లో ఆడనుంది. ఈ నేపథ్యంలో మహ్మద్ వసీమ్‌కు విశ్రాంతినివ్వడమే కరెక్టని పీసీబీ అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే గతేడాది జులైలో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన 21 ఏళ్ల వసీమ్ ఇప్పటి వరకు 8 వన్డేలు, 11 టీ20ల్లో ఆడాడు. మరి మ్యాచ్ సమయానికి వసీమ్ కోలుకుంటాడో లేదో చూడాలి. ఇండియా- పాక్ పోరులో ఎవరు గెలుస్తారో.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Mohammad Wasim missed practice in Dubai due to back pain, giving Pakistan another fright ahead of their Asia Cup opener against India on August 28.#AsiaCup #cricket #pakistanicricketteam #AsiaCup2022 #newsupdates #LatestNews #BreakingNews #HappeningNow #economyzoo pic.twitter.com/UfRWFbcYT7
— Economy zoo (@EconomyZoo) August 26, 2022