ఆసియా కప్ 2022లో కీలకమైన మ్యాచ్‌లో పాకిస్థాన్-అఫ్ఘనిస్థాన్ హోరాహోరీగా తలపడ్డాయి. నిజానికి ఈ మ్యాచ్ టీమిండియా కూడా ఎంతో కీలకం. ఈ మ్యాచ్‌లో అఫ్ఘనిస్థాన్ గెలిచి ఉంటే.. భారత్‌కు ఆసియా కప్ ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉండేవి. కానీ.. ఆఫ్ఘాన్ అద్భుతంగా పోరాడినా.. పాకిస్థాన్‌కు అదృష్టం కలిసి వచ్చింది. 129 పరుగుల టార్గెట్‌ను కాపాడుకునేందుకు ఆఫ్ఘాన్ బౌలర్లు ప్రాణం పెట్టి ఆడారు. కానీ.. చివర్లో ఒత్తిడి వారిని ఓడించింది. చివరి ఓవర్‌లో పాకిస్థాన్‌కు 11 పరుగులు కావాల్సిన టైమ్‌లో ఆఫ్ఘాన్‌కు ఒక్క వికెట్ చాలు, లేదా 10 పరుగులు ఇవ్వకుంటే చాలు.. ఇలాంటి సూపర్ థ్రిల్లింగ్ ఓవర్‌లో ఆఫ్ఘాన్ స్టార్ బౌలర్ ఇదే మ్యాచ్‌లో 18వ ఓవర్ సూపర్‌గా వేసిన ఫారూఖీ తడబడ్డాడు. టెయిలెండర్‌కు యార్కర్ వేసే క్రమంలో రెండు ఫుల్ టాస్ బంతులను వేసి రెండు సిక్సులు సమర్పించుకున్నాడు.
ఓడిపోతున్నాం అని ఫిక్స్ అయిన పాక్.. అనూహ్య విజయంతో సంబురాల్లో మునిగింది. ఆ సంబురాలు కాస్త అతి కావడంతో ఆఫ్ఘాన్ ఫ్యాన్స్‌కు మండింది. పాక్ ఫ్యాన్స్‌కు మూడింది. థ్రిల్లింగ్ విక్టరీతో సంబురాల్లో మునిగిన పాకిస్థాన్ అభిమానులపై ఆఫ్ఘాన్ ఫ్యాన్స్ దాడికి తెగబడ్డారు. స్టేడియంలోనే కుర్చీలతో పాక్ ఫ్యాన్స్‌ను ఇష్టమొచ్చినట్టు కొట్టారు. దీంతో ఒక్కసారిగా స్టేడియంలో భయాందోళనలు చెలరేగాయి. ఎక్కడికక్కడ ఆఫ్ఘాన్ ఫ్యాన్స్ పాక్ సపోర్ట్స్‌పై విరుచుకుపడ్డారు. గతంలో ఈ రెండు దేశాల అభిమానుల మధ్య కూడా ఘర్షణలు చోటు చేసుకున్నాయి. కానీ ప్రతిసారీ పాక్ అభిమానులు అతి చేయడం ఆఫ్ఘాన్ ఫ్యాన్స్ దాడి చేయడం పరిపాటిగా మారిపోయింది. బుధవారం మ్యాచ్‌లో కూడా పాక్ ఫ్యాన్స్ అతి సంబరాలే ఘర్షణకు కారణం అయినట్లు సమాచారం.
ఏది ఏమైనా.. ఆఫ్ఘాన్ ఫ్యాన్స్ భౌతిక దాడులకు దిగడం మాత్రం సబబు కాదని క్రికెట్ సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్ఘనిస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 129 పరుగులు మాత్రమే చేసింది. ఇబ్రహీం జద్రాన్ 35 పరుగులతో రాణించాడు. చివర్లో రషీద్ ఖాన్ రెండు ఫోర్లు, ఒక సిక్స్‌తో పర్వాలేదనిపించాడు. ఈ స్వల్ప లక్ష్యాన్ని పాకిస్థాన్ 19.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి అతి కష్టం మీద ఛేదించింది. చివరి ఓవర్‌లో 11 పరుగులు అవసరమవ్వగా.. బౌలర్ నసీమ్ షా రెండు భారీ సిక్సులతో పాకిస్థాన్‌ను గెలిపించాడు. మరి ఈ మ్యాచ్‌లో ఇరు దేశాల అభిమానుల ఘర్షణపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: గెలవాల్సిన మ్యాచ్‌లో పోరాడి ఓడిన అఫ్ఘనిస్థాన్! ఏడ్చేసిన క్రికెటర్లు
On a serious note, some of these afghan kids really need to learn how to behave. This is an international match not gully cricket. Never happens in any other matches. That’s the reason i really respect the other Cricket Teams
#PakvsAfg pic.twitter.com/jwRblDphRA— MUHAMMAD ROBAS (@IAmRobas) September 7, 2022
Afghans throwing chairs on Pakistanis. Shameful. #PakvsAfg #AsiaCup2022 pic.twitter.com/TMUVqEbjKE
— Omar Arshad (@omararshad) September 7, 2022
Clash between Pakistan and Afghanistan fans after yesterday’s cricket match. Afg vs Pak has replaced Ind vs Pak. pic.twitter.com/eCyItPC5px
— Facts (@BefittingFacts) September 8, 2022