ఆసియా కప్ 2022లో బుధవారం అఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్‌కు రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోవడంతో కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వచ్చాడు. ఈ మ్యాచ్‌లోనూ టీమిండియా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. రోహిత్ స్థానంలో విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించాడు. ఈ ఇద్దరూ ఆసియా కప్‌కు ముందు పెద్దగా క్రికెట్ ఆడలేదు. బ్యాడ్ ఫామ్‌తో కోహ్లీ విశ్రాంతి తీసుకుంటే.. కేఎల్ రాహుల్ గాయాలు, సర్జరీ, కరోనాతో విశ్రాంతి తీసుకున్నాడు. కోహ్లీ రెండు హాఫ్ సెంచరీలతో టచ్‌లోకి వచ్చిన రాహుల్ మాత్రం వరుసగా విఫలం అవుతూ వస్తున్నాడు. కానీ.. అఫ్ఘనిస్థాన్‌పై ఇద్దరూ చెలరేగారు. కేఎల్ రాహుల్ 41 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 62 పరుగులు చేసి ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపించాడు. విరాట్ అయితే 61 బంతుల్లోనే 12 ఫోర్లు, 6 సిక్సులతో 122 పరుగులు చేసి వీరవిహారం చేశాడు. చాలా కాలం రాకుండా వేధిస్తున్న సెంచరీని సాధించాడు. దీంతో టీమిండియా 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 212 పరుగుల భారీ చేసింది.
లక్ష్యఛేదనకు దిగిన అఫ్ఘనిస్థాన్‌ను భువనేశ్వర్ కుమార్ వణికించాడు. 5 వికెట్లతో చెలరేగి ఆఫ్ఘాన్ బ్యాటింగ్‌ను అతలాకుతలం చేశాడు. దీంతో అఫ్ఘనిస్థాన్ 21 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఘోర ఓటమి దిశగా సాగింది. కానీ.. ఇబ్రహీం జద్రాన్ 64 పరుగులతో విరోచిత పోరాటం చేసి ఆఫ్ఘాన్ దారుణమైన ఓటమి నుంచి కాపాడాడు. చివరికి 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన అఫ్ఘనిస్థాన్ 111 పరుగులు చేసి 101 పరుగుల తేడాతో ఓడింది. కాగా. మ్యాచ్ తర్వాత.. విలేకరుల సమావేశానికి హాజరైన కేఎల్ రాహుల్‌ను విలేకర్లు విరాట్ కోహ్లీ గురించి ప్రశ్నించగా.. కేఎల్ కొంత అసహనానికి గురైనట్లు అనిపించింది. అతని సమాధానం చూస్తే.. రాహుల్ ఇరిటేట్ అయిట్లే తెలుస్తుంది. అసలు ఏం జరిగిదంటే..
ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా అదరగొట్టాడు. చాలా కాలంగా రాని సెంచరీని ఓపెనర్‌గా వచ్చి సాధించాడు. అలాగే ఐపీఎల్‌లో కూడా ఓపెనర్‌గా వచ్చి 5 సెంచరీలు చేసిన ఘనత కోహ్లీకి ఉంది. మరి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే మెగా టోర్నీల్లో కోహ్లీని రోహిత్‌తో ఓపెనర్‌గా ఆడించే అవకాశం ఉందా అని రిపోర్ట్ కేఎల్ రాహుల్‌ను ప్రశ్నించగా.. కొంత అసహనానికి గురైన రాహుల్.. ‘మరీ నన్ను బయట కూర్చోమని అంటున్నారా?’ అని సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం కేఎల్ రాహుల్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కోహ్లీ సెంచరీతో కేఎల్ కొంత భయపడుతున్నట్లు, ఓపెనర్‌గా తన ప్లేస్‌కు ముప్పు వచ్చేలా ఉందని భావిస్తున్నట్లు సోషల్ మీడియాలో కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరి కేఎల్ రాహుల్ ఇచ్చిన సమాధానంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: కేఎల్ రాహుల్ బ్యాటింగ్ టీమిండియా కొంపముంచబోతుందా?