దుబాయ్ వేదికగా జరిగిన దాయాదుల పోరులో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి అందరకి తెలిసిందే. ఆఖరివరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై ఐదు వికెట్ల తేడాతో భారత జట్టు విజయం సాధించింది. మొదట పాకిస్తాన్ 147 పరుగులకు ఆలౌట్ కాగా, అనంతరం టీమిండియా 19.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచులో పాక్ ఓటమి పాలైనప్పటికీ.. ఆ జట్టు యువ పేసర్ నసీమ్ షా మాత్రం అభిమానుల మనసుసు గెలుచుకున్నాడు. గాయాన్ని సైతం లెక్క చేయకుండా.. దేశం కోసం అతడు పోరాడిన తీరు అందరిని కంటతడి పెట్టించింది.
కెరీర్ లో తొలి టీ20 మ్యాచ్.. అందులోనూ తొలి ఓవర్ వేయాలంటూ కెప్టెన్ నుంచి ఆదేశాలు.. క్రీజులో నిలకడకు మారుపేరైన ఆటగాడు.. ఇవన్నీ అతనిలో కాసింత భయాన్ని కూడా కలిగించలేకపోయాయి. ఇన్నింగ్స్ ప్రారంభించిన రెండో బంతికే.. కేఎల్ రాహుల్ క్లీన్ బౌల్డ్. అంతటితో ఆగాడా! లేదు.. సెకెండ్ స్పెల్‌కు తిరిగి బౌలింగ్‌కు వచ్చిన నసీమ్ షా.. ‘మిస్టర్ ఇండియా 360’ సూర్యకుమార్ యాదవ్‌ను క్లీన్ బౌల్డ్. మైదానంలో ఒక్కసారిగా సైలెన్స్. 19 ఏళ్ల కుర్రాడా ఈ బౌలింగ్ చేస్తోంది అని. ఈ క్రమంలో అతని పాదానికి గాయమైంది. కనీసం తన పాదాన్ని నేలపై కూడా ఉంచలేని స్థితికి చేరుకున్నాడు. అయినప్పటికీ.. నొప్పిని భరిస్తూనే తన ఓవర్‌ను పూర్తి చేశాడు. గాయం కారణంగా తన రిథమ్‌ను కోల్పోయిన నసీమ్ షా 18 ఓవర్ లో 11 పరుగులు సమర్పించుకున్నాడు. మొత్తానికి తన 4 ఓవర్ల కోటా పూర్తి చేసిన నసీమ్ షా.. 2 వికెట్లు తీసి 27 పరుగులు ఇచ్చాడు.
#naseemshah #PakVsInd
are we?? pic.twitter.com/3HbTPHUQLh— احمد سلمان 🇵🇰 (@n1tche5) August 29, 2022
ఈ నేపథ్యంలో అతను దేశం కోసం పోరాడిన తీరుపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నువ్ ఒక వీరుడివంటూ.. పొగడ్తలతో ముంచెత్తారు. పాక్ కెప్టెన్ బాబర్ ఆజం సైతం.. నసీమ్ షా ప్రదర్శనపై సంతృప్తిగా ఉన్నట్లు తెలిపాడు. ఓటమి తమను భాధించినప్పటికీ.. నసీమ్ షా ప్రదర్శన మాత్రం తమను నిరాశపరచలేదని చెప్పుకొచ్చాడు. ఆసియా కప్‌లో భారత్ తన తదుపరి మ్యాచ్‌లో హాంగ్ కాంగ్‌తో తలపడనుంది. ఆగస్టు 31న ఈ మ్యాచ్ జరగనుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. సెప్టెంబర్ 4వ తేదీన జరిగే సూపర్-4 మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ మరోసారి తలపడనున్నాయి. నసీమ్ షా పోరాడిన తీరుపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Naseem Shah going out after his final over. pic.twitter.com/2FMfG2MjAf
— Taimoor Zaman (@taimoorze) August 29, 2022
Just check his dedication! First stunned KL Rahul then almost got Kohli, in 2nd spell he bowled to inform batters & got SKY, was struggling with hamstring but still he bowled like a CHAMPION till last. This is Naseem Shah for you lads, hope he will be available for next games! pic.twitter.com/KwMOEIvTft
— Ahmad Haseeb (@iamAhmadhaseeb) August 28, 2022