పసికూన జట్లయినా బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి జట్ల చేతిలో చిత్తయినా చింతలేదు. కానీ, పొరుగు దేశం పాకిస్థాన్ చేతిలో ఓటమిని మాత్రం జీర్ణించుకోలేం! గెలిస్తే.. ప్రపంచ కప్ గెలిచినంతగా సంబురపడతాం. అదే.. ఓడితే 100 కోట్ల భారతీయుల హృదయాలు మూగబోతాయి. అప్పటివరకు హీరోలుగా ఉన్న మన క్రికెటర్లు.. జీరోలు అవుతారు. వారం గడిస్తే కానీ, మ్యాచ్ ఫలితాన్ని మరిచిపోలేం. అలాంటి హై వోల్టేజ్ సమరానికి సమయం ఆసన్నమైంది. మరో నాలుగో రోజుల్లో(ఆగస్టు 28) ఈ ఉత్కంఠ పోరుకు తెరలేవనుంది. ఈ తరుణంలో పాకిస్థాన్ హిట్టర్ అసిఫ్ అలీ, భారత్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చాడు.
ఆసియా కప్ సమరానికి సమయం దగ్గర పడడంతో కవ్వింపులు మొదలయ్యాయి. ఇప్పటివరకు విజయం మాదే అని చెప్పుకునేవారు ఆటగాళ్లు. అయితే.. పాకిస్తాన్ పవర్ హిట్టర్ ఆసిఫ్ అలీ ఒకడుగు ముందుకేసి.. పరోక్షంగా భారత జట్టుకు హెచ్చరికలు పంపాడు. భారత్‌తో మ్యాచ్ ముంగిట ఓ ఛానల్ తో ముచ్చటించిన అలీ.. ‘రోజుకు 100 నుంచి 150 సిక్సర్లు అలవోకగా కొడతానంటూ గొప్పలకు పోయాడు’. “నేను పవర్ హిట్టర్ ని. ఎక్కువుగా ఓవర్‌కు 10 పరుగులు చొప్పున చేయాల్సిన సమయంలో బ్యాటింగ్‌కు వెళ్తుంటాను. ఆ సమయంలో పెద్ద షాట్లు ఆడాలంటే ముందుగా ప్రాక్టీస్ చేయడం చాలా అవసరం. అందుకే ఇప్పుడు.. నెట్స్‌లో కనీసం 100-150 సిక్సర్లు కొడుతూ ప్రాక్టీస్ చేస్తున్నా. కాబట్టి మ్యాచ్‌లో కనీసం 4-5 సిక్సర్లు అలవోకగా కొట్టగలను’’ అని అలీ చెప్పుకొచ్చాడు.
.@AasifAli45 gearing up for #AsiaCup2022. pic.twitter.com/LE8e05G6rr
— CricTracker (@Cricketracker) August 24, 2022
కాగా, ఇప్పటివరకు ఆసియా కప్ టోర్నమెంట్ 14 ఎడిషన్లు పూర్తవగా.. భారత జట్టు 7 సార్లు, శ్రీలంక 5 సార్లు, పాకిస్తాన్ 2 సార్లు చాంపియన్స్ గా నిలిచాయి. ఇరుదేశాలు మధ్య సరిహద్దు వివాదాలు, రాజకీయ కారణాలతో ద్వైపాక్షిక సిరీసులు జరగడం లేదు. కేవలం.. ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడతున్నాయి. ఈ తరుణంలో ఈ మ్యాచ్ టోర్నీకే హైలైట్ గా నిలవనుంది. అసిఫ్ అలీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#India clinching 🏆 in 2018 under #RohitSharma 🔥#ViratKohli‘s highest score of 183 vs #Pakistan 🏏@Tanay_Tiwari brings you #TeamIndia‘s top-5 moments in the #AsiaCup pic.twitter.com/GWj94T0XPF
— Cricbuzz (@cricbuzz) August 24, 2022