దుబాయ్ వేదికగా జరిగిన దాయాదుల పోరులో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అంటు బంతితో, ఇటు బ్యాటుతో రాణించి జట్టుకు విజయాన్నందించాడు. అంత ఒత్తిడిలోనూ.. అతడు రాణించిన తీరు అమోఘమంటూ.. పాండ్యా ప్రదర్శనపై విదేశీ క్రికెటర్లు, మాజీ కోచులు హార్దిక్ ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. ఈ విషయంపై.. పాకిస్తాన్ మాజీ కోచ్ మిక్కీ ఆర్థర్ స్పందిచాడు. ‘భారత జట్టు 12 మంది ఆటగాళ్లతో బరిలోకి దిగింది.. అందుకే విజయం వరించింది’ అని పేర్కొన్నాడు. ఇంతకీ.. ఆ 12 మంది కథేంటో చూద్దాం..
గతంలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, పాకిస్తాన్ వంటి జట్లకు కోచ్‌గా వ్యవహరించిన మిక్కీ ఆర్థర్.. పాండ్యాను తెగ మెచ్చుకున్నాడు. అతన్ని చూస్తుంటే సఫారీ దిగ్గజ ఆల్ రౌండర్ జాక్వెస్ కలిస్ గుర్తొస్తున్నాడని చెప్పుకొచ్చాడు. “సౌతాఫ్రికాకు కలిస్ అద్భుతమైన సేవలు అందించాడు. బ్యాటింగ్ లో నిలకడగా రాణించే కలిస్.. బంతితో కూడా అద్భుతాలు చేసేవాడు. చూస్తుంటే.. పాండ్యా కూడా అతనిలాగే ఉన్నాడని, ఇది భారత జట్టుకు బాగా కలిసొచ్చే అంశం. అంతేకాదు.. అతడి వల్ల భారత జట్టు 12 మందితో ఆడుతున్నట్లు కనిపిస్తోంది”.
Mickey Arthur heaps praise on the rise of Hardik Pandya 🗣#T20Timeout #INDvPAK
— ESPNcricinfo (@ESPNcricinfo) August 29, 2022
“జట్టులో స్థానం కోల్పయి మళ్లీ రీఎంట్రీ ఇవ్వడం అంటే.. అంత సులభమైన పని కాదు. ఇప్పుడు పాండ్యా చాలా మెచ్యూర్‌గా కనిపిస్తున్నాడు. ఐపీఎల్‌లో కూడా గుజరాత్ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు తను ముందడుగు వేసి విజయాలు అందించాడు. నాలుగేళ్ల క్రితం పాండ్యా వేరు.. ఇప్పుడు పాండ్యా వేరు..” అని హార్దిక్ పై.. మిక్కీ ఆర్థర్ ప్రశంశల వర్షం కురిపించారు.
The winning six by Hardik Pandya.pic.twitter.com/581VFcrHZd
— Johns. (@CricCrazyJohns) August 29, 2022
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పాక్ కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ఫలితంగా 147 పరుగులకే చాప చుట్టేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసి గెలిచింది. కెరీర్‌లో 100వ టీ20 మ్యాచ్ ఆడిన కోహ్లి (34 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్) విలువైన పరుగులు జతచేస్తే.. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హార్దిక్ పాండ్యా (17 బంతుల్లో 33 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో హాంకాంగ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఆగస్టు 31న జరగనుంది.
Hardik Pandya soaks in all the love 💞#AsiaCup2022 | #INDvPAK
🎥 @hardikpandya7 pic.twitter.com/NfgL4IWFRM
— ESPNcricinfo (@ESPNcricinfo) August 30, 2022