రికార్డుల రారాజుగా, పరుగుల యంత్రంగా పేరుగాంచిన కోహ్లీ తన కెరియర్‌లో లెక్కలేనని రికార్డులు సాధించాడు. ఇది గతంలో. గత రెండు, మూడేళ్లుగా ఈ రన్ మెషీన్ నుంచి పరుగులు రావడం గగనంగా మారిపోయింది. అతడి బ్యాట్ నుంచి సెంచరీ చూసి ఎన్నాళ్లయిందో తెలుసా? వెయ్యి రోజులు గడిచిపోయాయి. ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న విరాట్ కోహ్లీ ఇంటాబయట విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ విమర్శలన్నింటికీ ఆదివారం జరగబోయే మ్యాచ్ లో సమాధానం చెప్తాడనుకుంటే.. అర్థం లేని మాటలతో యావత్ అభిమానులను కలవరపాటుకు గురిచేస్తున్నాడు.
బాబర్ అజామ్‌ను “ప్రపంచ క్రికెట్‌లో అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్’ గా అభివర్ణించాడు కోహ్లీ. 2019, మాంచెస్టర్‌లో తనను మొదటిసారి కలిచానన్న కోహ్లీ, తన కంటే ఆరేళ్లు చిన్నవాడు.. తన పట్ల చూపే గౌరవానికి ముగ్దుడయ్యానని ప్రశంసించాడు. ” 2019 ప్రపంచ కప్ సమయంలో మాంచెస్టర్‌లో (భారత్-పాకిస్థాన్) మ్యాచ్ తర్వాత నేను అతనితో మొదటి కలిశా. ఇక.. ఇమాద్ వసీమ్ అంటారా! అతను నాకు అండర్19 క్రికెట్ నుండి తెలుసు. ఒకరితో ఒకరు ఆడాము. ఆరోజు మ్యాచ్ ముగిశాక.. ఇమాద్, నా దగ్గరకు వచ్చి బాబర్ నీతో మాట్లాడాలనుకుంటున్నారని చెప్పాడు. సరే అన్నాను. అందరం కూర్చున్నాం. ఆట గురించి మాట్లాడాము. ఆరోజు అతని వ్యక్తిత్వం.. నాపట్ల చూపే గౌరవాన్ని ప్రత్యక్షంగా చూశాను.
Virat Kohli is in awe and admiration of Babar Azam’s character!#AsiaCup2022 | #INDvPAK | #PAKvIND pic.twitter.com/MwLof5kA8Y
— Grassroots Cricket (@grassrootscric) August 27, 2022
“ప్రస్తుతం బాబర్ ప్రపంచంలోని టాప్ బ్యాట్స్‌మెన్. అన్ని ఫార్మాట్‌లలో చాలా నిలకడగా రాణిస్తున్నాడు. అతని ఆటను చూడటం నేను ఎప్పుడూ ఆనందిస్తాను” అని బాబర్ పట్ల తనకున్న ప్రేమను కోహ్లీ బయటపెట్టాడు. ప్రస్తుతం బాబర్ ఆజమ్.. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో మూడవ స్థానంలో ఉండగా, వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో ఉన్నాడు. ఫామ్‌లో లేని కోహ్లీకి తన సంఘీభావాన్ని తెలుపుతూ జూలైలో పాకిస్తాన్ కెప్టెన్ ట్వీట్ చేసినప్పటి నుండి కోహ్లీ-బాబర్ మధ్య స్నేహం మరింత ఎక్కువైంది. అందులోనూ, ఆసియా కప్ ముంగిట ప్రాక్టీస్ సెషన్‌లో ఒకరినొకరు పలకరించుకోవడం అందరకి తెలిసిందే.
ఇక.. ఆదివారం దుబాయ్ వేదికగా ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ విరాట్ కోహ్లీకి ప్రాతఃఏకమైంది. తన కెరీర్ లో ఇది వందో టీ20 మ్యాచ్. కనీసం ఈ మ్యాచులోనైనా రాణించచాలని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. విరాట్ కోహ్లీ వ్యాఖ్యలపై అభిమానులు భగ్గుమంటున్నారు.’ ప్రపంచమంతా విరాట్ కోహ్లీయే.. నెంబర్ 1 బ్యాటర్ అంటుంటే.. మీరు బాబర్ టాప్ బ్యాట్స్‌మెన్’ అని పొగడడం సరికాదంటూ కామెంట్ చేస్తున్నారు. మరోవైపు.. విరాట్ కోహ్లీ హేటర్స్ మరో అడుగు ముందుకేసి.. బాబర్ నెంబర్ -1 అయితే.. నువ్, నెంబర్ – 2హా అని కామెంట్ చేస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Virat About Babar Azam..❤️❤️#ViratKohli𓃵 #India🇮🇳#AsiaCup2022 #INDvPAK #BabarAzam𓃵 #StarSports pic.twitter.com/KrKPZw7OPf
— Archit Gupta (@Archit_G_0019) August 27, 2022