టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీపై సౌతాఫ్రికాతో తొలి టెస్ట్‌లో 35 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో కోహ్లీపై విమర్శలు మొదలయ్యాయి. ఈ సారి విమర్శతో పాటు ఒక సలహా కూడా వచ్చింది. అది కూడా టీమిండియా మాజీ క్రికెటర్ అశిష్ నెహ్రా నుంచి. సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ప్రారంభమై.. మొదటిరోజు ఆట జరిగి, రెండో రోజు వర్షం కారణంగా ఆట జరగలేదు. ఇక మూడో రోజన్న ఆట జరుగుతుందో? లేదో? చూడాలి. మ్యాచ్ విషయం పక్కన పెడితే.. నెహ్రా చేసిన కామెంట్లు ఇప్పుడు చర్చనీయంశంగా మారాయి. కోహ్లీ.. 2018 తర్వాత నుంచి సరిగ్గా ఆడటం లేదని, ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడని, సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో కూడా ఈ విషయం మరోసారి రుజువైందని అన్నాడు.
అంతేకాకుండా.. సౌతాఫ్రికా పిచ్‌లపై అనవసరపు షాట్లు ఆడుకుండా.. కేఎల్ రాహుల్‌ను ఫాలో అయితే సరిపోతుందని సలహా ఇచ్చాడు. దీనిపై కోహ్లీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. విరాట్ కోహ్లీ ఎంత గొప్ప బ్యాట్స్‌మెన్ అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సి పనిలేదని, అతను బ్యాటింగ్ మరే ఆటగాడిని ఫాలో కావాల్సిన అవసరం లేదని.. కచ్చితంగా ఫామ్‌లోకి వచ్చి.. భారీ ఇన్నింగ్స్ ఆడాతాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో నెహ్రా వ్యాఖ్యలను తప్పుబడుతూ.. కోహ్లీకి మద్దతుగా నిలుస్తున్నారు. మరి నెహ్రా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.