క్రికెట్ ప్రపంచంలో ఏ సిరీస్ జరిగినా కప్ కోసమే జరుగుతుంది. కానీ ఒక్క సిరీస్ మాత్రం బూడిద కోసం జరుగుతుంది. అదే ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య జరిగే ది యాషెస్ సిరీస్. క్రికెట్ వరల్డ్‌లో ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌కు ఉండే క్రేజ్‌కు మించి ఉంటుంది యాషెస్ క్రేజ్. ఈ సిరీస్‌లో ఇరుజట్ల ఆటగాళ్లు ప్రాణం పెట్టి ఆడతారు. ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లతో గొడవలకు దిగుతారు. తీవ్ర భావోద్వేగాల మధ్య మ్యాచ్ జరుగుతుంది. టెస్ట్ మ్యాచ్‌లలో ఇంతటి ఉత్కంఠ, భావోద్వేగం మరే దేశాల మధ్య జరిగే టెస్ట్‌లలో చూడలేం. దాదాపు ఒక యుద్ధం వాతావరణం ఉంటుంది మైదానంలో. ప్రతి బంతిని, ప్రతి పరుగును చాలా సీరియస్‌గా తీసుకుంటారు ఇరు జట్ల ఆటగాళ్లు. ఈ సిరీస్ గెలిస్తే ప్రపంచ కప్ సాధించిన దానికన్నా ఎక్కువ సంబరాలు జరుపుకుంటారు. ఇన్ని ఎలిమెంట్స్ ఉన్న ఈ సిరీస్‌కు అసలు దీనికి యాషెస్ సిరీస్ అనే పేరు ఎలా వచ్చింది? ఎందుకు ఆటగాళ్లు ఈ సిరీస్‌ను అంత సీరియస్‌గా తీసుకుంటారు? అనే విషయాలను క్షుణ్ణంగా తెలుసుకుందాం..
1882, ఆగస్ట్ 29న ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇంగ్లండ్ క్రికెట్‌కు పుట్టినిల్లు అనే విషయం తెలిసిందే. అయితే ఓవల్‌లో జరిగిన ఒక మ్యాచ్‌తో క్రికెట్ ప్రపంచంలో యాషెస్ అనే భావోద్వేగాలతో కూడిన సిరీస్ ప్రారంభానికి బీజం పడింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయానికి కేవలం 85 పరుగులు మాత్రమే కావాలి. అప్పటికి ఇంగ్లండ్ టీం స్కోరు రెండు వికెట్లకు 51 పరుగులు. అయితే, అనూహ్యంగా ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. ఇంగ్లండ్‌లో ఆస్ట్రేలియాకు ఇది తొలి విజయం. స్వదేశంలో ఇంగ్లండ్ ఓడిపోవడంతో ఇంగ్లీష్ మీడియా సొంతం జట్టుపై దుమ్మెత్తిపోసింది. జట్టును దారుణంగా విమర్శిస్తూ.. అన్ని పత్రికలు కథనాలు ప్రచురించాయి.
Just one more day to go… #Ashes pic.twitter.com/9HojKDPGQp
— ESPNcricinfo (@ESPNcricinfo) December 6, 2021
ఈ మ్యాచ్‌తో స్పోర్టింగ్ టైమ్స్.. “ఇంగ్లీష్ క్రికెట్ చనిపోయింది. 29 ఆగస్టు 1882, ఓవల్‌లో ఇంగ్లండ్ టీం అంత్యక్రియల తర్వాత వచ్చిన బూడిదను (యాషెస్) ఆస్ట్రేలియా తీసుకెళ్లింది.. ” అంటూ ఒక కథనం రాసుకొచ్చింది. ఈ వార్త అప్పట్లో సంచలనం సృష్టించింది. క్రికెట్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిని ఇంగ్లండ్ అభిమానులు, మీడియా జీర్ణించుకోలేకపోయాయి. తమ ఆత్మగౌరవం మంటగలిసిపోయినట్లు వారు భావించారు. అందుకే ఇంగ్లీష్ జట్టుపై తమ కోపాన్ని ప్రదర్శించారు. ఆ తరువాత ఏడాది ఇంగ్లండ్ జట్టు ఆస్ట్రేలియా వెళ్లినప్పుడు.. ‘యాషెస్‌ను తిరిగి తీసుకుని రావాలంటూ’ మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి. ఇక అక్కడి నుంచి ఈ రెండు దేశాల టెస్ట్ జట్లు ముఖాముఖిగా తలపడే 5 టెస్టుల సిరీస్‌కు యాషెస్ అని పేరు పెట్టారు. ఈ సిరీస్ కోసం ఒక ప్రత్యేక ట్రోఫీని తయారు చేశారు. దీనిలో మొప్పలను కాల్చిన తర్వాత బూడిదను ఉంచుతారు. ఈ ట్రోఫీని యూఆర్‌ఎన్ అని కూడా పిలుస్తారు, ఇది బూడిద కలిగిన పాత్ర. నేటికీ ఈ సంప్రదాయం కొనసాగుతోంది.
One more sleep! #Ashes pic.twitter.com/r6A92yiUUO
— ICC (@ICC) December 7, 2021
కాగా ఈ నెల 8 నుంచి జనవరి 18 వరకు యాషెస్ సిరీస్ జరగనుంది. ఈ సారి ఆస్ట్రేలియా దీనికి ఆతిథ్యమిస్తుంది. ఇంగ్లండ్‌లో చివరిసారిగా యాషెస్ సిరీస్ 2019లో జరిగింది. ఆ సిరీస్‌లో, టిమ్ పైన్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు 4-0తో యాషెస్ ట్రోఫీని గెలుచుకుంది. ఇప్పుడు మళ్లీ ఎలాగైనా తమ ఆత్మగౌరవాన్ని తిరిగి తేవాలని ఇంగ్లండ్ పట్టుదలతో ఉంది. కాగా ఇప్పటి వరకు 71 సార్లు యాషెస్ సిరీస్ జరగ్గా.. 33 సార్లు ఆస్ట్రేలియా, 32 సార్లు ఇంగ్లండ్ విజేతలుగా నిలిచాయి. 6 సార్లు సిరీస్ డ్రాగా ముగిసింది. మరి ఇంతటి చరిత్ర కలిగిన ఈ యాషెస్ సిరీస్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Ricky Ponting has spoken! The Aussie legend shares his predicted #Ashes scoreline, and the venue where England will most trouble Australia pic.twitter.com/4hCA3ayLWw
— cricket.com.au (@cricketcomau) December 7, 2021