ఇటీవలే డబ్ల్యూటీసీ ఫైనల్లో గెలిచి ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచిన ఆసీస్ జట్టు.. ప్రస్తుతం యాషెస్ లో భాగంగా తొలి టెస్టు ఆడుతుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు కంగారూల జట్టుకు టెస్టు ఛాంపియన్ షిప్ కన్నా.. యాషెసే వారి తొలి తొలి ప్రాధాన్యమని అర్ధం అవుతుంది.
యాషెస్ ఆస్ట్రేలియాకి ఎంత ప్రతిష్టాత్మకమో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వరల్డ్ కప్, యాషెస్ కి వీరు సమాన ప్రాధాన్య మిస్తారు. దాదాపు 140 ఏళ్ళ చరిత్ర ఉన్న యాషెస్ అంటే ఆస్ట్రేలియాకి ఒక ఎమోషన్. ఈ సిరీస్ వస్తుందంటే చాలు వీరి ప్రిపరేషన్ నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. అయితే ఇటీవలే డబ్ల్యూటీసీ ఫైనల్లో గెలిచి ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచిన ఆసీస్ జట్టు.. ప్రస్తుతం యాషెస్ లో భాగంగా తొలి టెస్టు ఆడుతుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు కంగారూల జట్టుకు టెస్టు ఛాంపియన్ షిప్ కన్నా.. యాషెసే వారి తొలి తొలి ప్రాధాన్యమని అర్ధం అవుతుంది. వినడానికి ఈ విషయం ఆశ్చర్యంగా ఉన్నా.. ఇదే నిజం. దీనికి సంబంధించిన కొన్ని కారణాలు ఇప్పుడు చూద్దాం.
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ రెండేళ్ల ఈ ప్రయాణంలో అన్ని జట్లు ఆడతాయి. టెస్టు ఛాంపియన్ షిప్ గద లక్ష్యంగా రెండేళ్ల పాటు తీవ్రంగా శ్రమిస్తాయి. 2019 లో స్టార్ట్ అయిన డబ్యూటీసీ ఇప్పటివరకు రెండు ఫైనల్స్ జరిగాయి. మొదటిసారి న్యూజిలాండ్, ఇటీవలే ఆస్ట్రేలియా ఛాంపియన్ లు గా అవతరించాయి. అయితే ఆసీస్ డబ్ల్యూటీసీ ఫైనల్ ల్లో ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ జోష్ హేజల్ వుడ్ ని ఆడించని సంగతి తెలిసిందే. అతడు పాత గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని, డబ్ల్యూటీసీ ఫైనల్ తో పాటు యాషెస్ సిరీస్ లో రెండు టెస్టులకు అందుబాటులో ఉండేది అనుమానమే అని ప్రకటించింది.
కానీ యాషెస్ టెస్టు సిరీస్ లో భాగంగా నేడు ఇంగ్లాండ్ తో బర్మింగ్‌హామ్ వేదికగా ఆరంభమైన తొలి టెస్టులో హేజల్ వుడ్ ని ఆడిస్తున్నది. పాట్ కమిన్స్, జోష్ హెజిల్వుడ్, స్కాట్ బొలాండ్ లతో కూడిన బౌలింగ్ త్రయం తొలి టెస్టులో ఆడుతన్నది. ఆ జట్టు స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ గాయం కారణంగా తొలి టెస్టుకు అందుబాటులో లేడు. దీనిని బట్టి చూస్తే టీమిండియా బ్యాటింగ్ లైనప్ కు హెజిల్వుడ్ వంటి స్టార్ బౌలర్ ను వాడటం అవసరమా..? అని క్రికెట్ ఆస్ట్రేలియా భావనగా ఉందని వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాదు తాజాగా స్టీవ్ స్మిత్ మాకు డబ్ల్యూటీసీ ఫైనల్ కన్నా.. యాషెసే ముఖ్యం అని బహిరంగంగానే చెప్పుకొచ్చాడు. మొత్తానికి యాషెస్ కి డబ్ల్యూటీసీ ఫైనల్ ఉన్నా.. ఆసీస్ దృష్టంత యాషెస్ మీదే ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విషయంలో మీ అభిప్రయాలను కామెంట్ల రూపంలో తెలపండి.