పట్టుమని పదేళ్లు దాటని చిన్నారులు ఆట పాటల్లో, విజ్ఞానంలో ముందుకు సాగుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు కొల్లగొడుతుండటంలో పాటు పేరు ప్రఖ్యాతలు గడిస్తున్నారు. దేశానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తున్నారు. కేవలం చదువే కాకుండా క్రీడల్లోనూ రాణిస్తున్నారు.
చిన్న వయస్సులోనే బుద్ది బలం, కండ బలాన్ని ప్రదర్శిస్తూ ఔరా అనిపిస్తున్నారు బుడుగులు. పట్టుమని పదేళ్లు దాటని చిన్నారులు ఆట పాటల్లో, విజ్ఞానంలో ముందుకు సాగుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు కొల్లగొడుతుండటంలో పాటు పేరు ప్రఖ్యాతలు గడిస్తున్నారు. దేశానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తున్నారు. కేవలం చదువే కాకుండా క్రీడల్లోనూ రాణిస్తున్నారు. చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు వీరికి శిక్షణనిస్తున్నారు. ముఖ్యంగా నేటి తరం ఆడపిల్లలు అదరగొడుతున్నారు. చదువును నిర్లక్ష్యం చేయకుండానే క్రీడల మీద చిన్న వయస్సు నుండి మక్కువ పెంచుకుంటున్నారు. అందుకు సంబంధించిన శిక్షణ తీసుకుంటూ.. రాష్ట్ర స్థాయిలోనే కాదూ అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధిస్తున్నారు. ఆ కోవకు చెందినదే ఆర్షియా అనే బాలిక.
ఆర్షియా వయస్సు ఎనిమిదేళ్లు. ఆమె ప్రత్యేకతేంటో తెలుసా ఈ వయస్సులో వెయిట్ లిఫ్టింగ్‌లో సామాన్యులకు సాధ్యం కానీ బరువును అవలీలగా ఎత్తేస్తూ అబ్బురపరుస్తుంది. హర్యానాలోని పంచకుల ప్రాంతానికి చెందిన అర్షియా గోస్వామి.. వెయిట్ లిఫ్టింగ్‌లో అంచనాలను మించి రాణిస్తోంది. బరువులు ఎత్తడంలో కరణం మల్లీశ్వరినీ మించిపోతుంది. ఎనిమిదేళ్ల వయస్సులో 60 కిలోల బరువును ఎత్తుతోంది. గతంలో ఆరేళ్ల వయసులో 45 కిలోల బరువును ఎత్తడం ద్వారా, 2021లో అత్యంత పిన్న వయస్కురాలైన డెడ్‌లిఫ్టర్‌గా రికార్డు సృష్టించింది. తోటి పిల్లలతో ఆడుకోవాల్సిన వయస్సులో కసరత్తులు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చాను నుండి తాను ప్రేరణ పొందినట్లు అర్షియా వీడియోలో పేర్కొంది. మొదట ఆరు సంవత్సరాల వయస్సులో 45 కిలోల బరువును ఎత్తి రాష్ట్ర స్థాయిలో జరిగిన వెయిట్ లిఫ్టింగ్ టోర్నీలో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఆనాటి నుంచి బుల్లి బాహుబలిగా పేరొంది, అలవోకగా బరువులు ఎత్తేస్తుంది. పవర్‌లిఫ్టింగ్ మరియు టైక్వాండో గోస్వామికి ఇష్టమైన మరో రెండు క్రీడలు. దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలిగా ఈ అవార్డు సాధిస్తున్నందుకు ఆనందంగా ఉందన్న.. అర్షిత.. బంగారు పతకం సాధించడం తన కలని ఆర్షియా పేర్కొంది. అవార్డులతో పాటు రికార్డులు కొడుతుంది.