భారత క్రికెట్ అభిమానులు దేవుడిగా కొలిచే టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆటకు గుడ్ బై చెప్పి దశాబ్దం దాటిపోయింది. అయినప్పటికీ ఆ జ్ఞాపకాలు మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. అయితే.. సచిన్ మాదిరే అతని కొడుకు అర్జున్ టెండూల్కర్ కూడా క్రికెట్ నే కెరీర్ గా ఎంచుకున్నాడు. కానీ, అవకాశాలు రాక దేశవాళీ క్రికెట్ కే పరిమితమవుతున్నాడు. ఈ క్రమంలో ఇలా అయితే భారత జట్టులోకి ఎంట్రీ ఇవ్వడం వర్కవుట్ అవ్వదనుకున్న అర్జున్ టెండూల్కర్ ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు.
సచిన్ మాదిరిగానే అర్జున్ కూడా చిన్న వయసులోనే టీమిండియాలోకి వస్తాడని అప్పట్లో వార్తలు వినిపించినా అది నిజం కాలేదు. అర్జున్, దేశవాళీ క్రికెట్‌లో కనిపించకపోయినా, ముంబై ఇండియన్స్ ఐపీఎల్ జట్టులో మాత్రం ఉంటున్నాడు. రూ. 10 లక్షలో.. 20 లక్షలో పెట్టి ప్రతిసారి వారితోనే అంటిపెట్టుకుంటున్నా అవకాశాలు మాత్రం ఇవ్వడం లేదు. అదిగో.. నెక్స్ట్ మ్యాచులో బరిలోకి దిగుతాడంటూ.. ఊహాగానాలు రావడం తప్ప, ఆడింది లేదు. దీని వెనుకున్న అసలు కారణాన్ని అర్జున్ పసిగట్టాడు. అవకాశాలు రానిది ఆటలో నాణ్యత లేక అని అర్థం చేసుకున్నాడు. అందుకే కొత్త ప్రయత్నానికి శశ్రీకారం చుట్టాడు.
Arjun Tendulkar is training with Yograj Singh (father of Yuvraj Singh) in his academy at DAV College, Chandigarh to improve his batting skills and revive his career. pic.twitter.com/JVtrnXWOLi
— Abhishek Ojha (@vicharabhio) September 23, 2022
అర్జున్, తన బ్యాటింగ్ స్కిల్స్ ను మెరుగుపరుచుకోవడానికి ఓ ప్రత్యేక కోచ్ వద్ద శిక్షణ పొందుతున్నాడు. ఆ కోచ్ ఎవరో కాదు. టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్. ప్రస్తుతం అర్జున్, అతని వద్దే శిక్షణ పొందుతున్నాడు. ఛండీగఢ్ లోని యువీ క్రికెట్ అకాడమీలో యోగరాజ్.. అర్జున్ కు బ్యాటింగ్ మెళుకువలు నేర్పుతున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ శిక్షణ అర్జున్ కు ఏ మేరకు ఉపయోగపడుతుందనేది కాలమే నిర్ణయించనున్నది. ఈ విషయంపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Yograj Singh training Arjun Tendulkar.. exciting pic.twitter.com/JnF054WakF
— Navaldeep Singh (@NavalGeekSingh) September 23, 2022