తెలుగు తేజం, అండర్ 19 వరల్డ్ కప్ హీరో గుంటూరుకు చెందిన షేక్ రషీద్ బుధవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశాడు. ఈ సందర్భంగా అండర్19 వరల్డ్ కప్‌లో మంచి ప్రదర్శన కనబర్చినందుకు రషీద్‌ను సీఎం జగన్ అభినందించారు. ఈ సందర్భంగా గుంటూరులో యువ క్రికెటర్ కుటుంబానికి నివాస స్థలాన్ని కేటాయించడంతో పాటు ప్రభుత్వం తరపున రషీద్‌కు పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. అంతేకాకుండా ప్రభుత్వం తరపున రూ.10 లక్షల నగదు పురస్కారం అందజేస్తామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని కూడా తెలిపారు.
#ShaikRashid – the Indian under 19 cricket team’s vice captain, was congratulated by honourable CM Shri @ysjagan garu for his outstanding performance at the U-19 cricket World Cup. Rashid was given a cheque for 10 lakhs from ACA and another 10 lakhs from the AP govt. pic.twitter.com/dsHF6mG0SD
— Mekathoti Sucharitha (@SucharitaYSRCP) February 16, 2022
షేక్ రషీద్‌కు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రకటించిన రూ.10 లక్షల చెక్‌ను వైఎస్ జగన్ చేతుల మీదుగా అందజేశారు. యువ క్రికెటర్ షేక్ రషీద్ డిగ్రీ పూర్తి కాగానే సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగం ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ అధికారుల్ని ఆదేశించారు. అండర్ 19 ప్రపంచకప్‌లో రషీద్ భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ టోర్నీలో రషీద్ నాలుగు మ్యాచ్‌లు ఆడి 50.25 సగటుతో 201 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. యశ్ ధుల్ సారథ్యంలోని భారత్ జట్టు అండర్19 వరల్డ్ కప్ గెలిచిన విషయం తెలిసిందే. మరి రషీద్‌కు సీఎం జగన్ ఇచ్చిన నజరానాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Under 19 Indian Cricket team Vice Captain Sk Rasheed meets hon’ble CM @ysjagan garu 🙏🙏 pic.twitter.com/BwBN5vwBh4
— Maheswari (@APCMYSJMR) February 16, 2022