విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం సోషల్ మీడియా మెుత్తం ఈ నామస్మరణంతో మారుమ్రోగిపోతోంది. దానికి కారణం నవంబర్ 5న కింగ్ విరాట్ కోహ్లీ బర్త్ డే కావడమే. దాంతో ప్రపంచ నలుమూలల ఉన్న క్రికెట్ అభిమానులందరూ సోషల్ మీడియా వేదికగా విరాట్ కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అయితే అవన్నీ విషెస్ లు ఒకవైపు అయితే.. విరాట్ జీవిత భాగస్వామి అనుష్క శర్మ చేసిన బర్త్ డే విషెస్ మరోవైపు. కోహ్లీ పుట్టిన రోజు సందర్భంగా అనుష్క శర్మ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. నీ పుట్టిన రోజు సందర్బంగా నేను నీ బెస్ట్ యాంగిల్స్ పిక్ చేశాను చూడు అంటూ.. విరాట్ కొన్ని ఫన్నీ పిక్స్ ను షేర్ చేసింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ.. అటు క్రికెట్ ప్రపంచంలో, ఇటు సినీ ప్రపంచంలో మోస్ట్ క్రేజియెస్ట్ కపుల్. విరాట్ క్రికెట్ మ్యాచ్ లతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సమయం చిక్కినప్పుడల్లా అనుష్క శర్మతో కలిసి వెకెషన్ లకు వెళ్తుంటాడు. ప్రస్తుతం విరాట్ వరల్డ్ కప్ తో బిజీగా ఉంటే.. అటు అనుష్క సైతం షుటింగ్ లతో తీరికలేకుండా గడుపుతోంది. ఈ క్రమంలనే నవంబర్ 5న కోహ్లీ బర్త్ డే కావడంతో తన భర్తకు కాస్త వెరైటీగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పింది. ఇన్ స్టా గ్రామ్ లో అనుష్క ఈ విధంగా రాసుకొచ్చింది. “నా ప్రియ సఖుడా ఈ రోజు నీ బర్త్ డే సందర్భంగా.. నువ్వు దిగిన బెస్ట్ యాంగిల్స్ ఫొటోలను షేర్ చేస్తున్నాను. నిన్ను ప్రతీక్షణం ప్రేమిస్తునే ఉంటాను. పుట్టిన రోజు శుభాకాంక్షలు మై లవ్ ” అంటూ కోహ్లీ ఫన్నీ పిక్స్ ను పోస్ట్ చేసింది.
ఈ పిక్స్ లల్లో కోహ్లీ చాలా ఫన్నీ లక్స్ తో నవ్విస్తున్నాడు. ఓ పిక్ లో టోపీ పెట్టుకుని ఓ చేతిలో క్యారీ బాగ్, మరో చేతిలో చెప్పులు పట్టుకుని ఇచ్చిన పోజు భలే గమ్మత్తుగా ఉంది. మరో ఫొటో లో నైట్ సెల్పీ దిగగా.. కుమార్తె ను ఎత్తుకుని కూర్చున్న పిక్ సరదాగా ఉంది. ప్రస్తుతం అనుష్క శర్మ షేర్ చేసిన ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. ఇక విరాట్ బర్త్ డే సందర్బంగా అభిమానులతో పాటుగా స్టార్ క్రికెటర్లు సైతం.. అతడితో ఉన్నఅనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గ్లెన్ మాక్స్ వెల్ విషెస్ తెలుపుతూ..”విరాట్ కోహ్లీ నా బెస్ట్ ఫ్రెండ్. అతడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు” చెప్పుకొచ్చాడు.