కరేబియన్ క్రిషింగ్ మెషీన్ ఆండ్రీ రస్సెల్ విశ్వరూపం చూపించాడు. ఆన్‌క్యాప్డ్ బౌలర్‌పై ఉప్పెనలా విరుచుకుపడ్డాడు. తన పవర్‌హిట్టింగ్‌ను రూచి చూపిస్తూ.. ఐదు బంతుల ఓవర్‌లో 6, 4, 6, 4, 4 బాది ఔరా అనిపించాడు. ఈ ఊరమాస్ ఇన్నింగ్స్‌ను రస్సెల్ ఇంగ్లండ్‌లో జరుగుతున్న ది హండ్రెడ్ లీగ్‌లో ఆడాడు. గురువారం మాంచెస్టర్ ఒరిజినల్స్-సదరన్ బ్రేవ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రస్సెల్ రెచ్చిపోయి ఆడాడు. కేవలం 23 బంతుల్లోనే 6 ఫోర్లు, 5 సిక్సులతో 64 పరుగులు చేసి అదరగొట్టాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మాంచెస్టర్ ఒరిజినల్స్ నిర్ణీత 100 బంతుల్లో 3 వికెట్లు కోల్పోయి 188 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ 42 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సులతో 68, మరో ఓపెనర్ సాల్ట్ 22 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 38 పరుగులు చేసి రాణించగా.. చివర్లో రస్సెల్ సునామీ ఇన్నింగ్స్‌తో మాంచెస్టర్ భారీ స్కోర్ సాధించింది. ఇన్సింగ్స్ చివర ఐదు బంతులను మాత్రం రస్సెల్ చీల్చిచెండాడు.
హొగన్ వేసిన చివరి ఐదు బంతుల్లో రస్సెల్ వరుసగా 6, 4, 6, 4 , 4 బాది 24 పరుగులు పిండుకున్నాడు. ఇక భారీ లక్ష్యఛేదనకు దిగిన సదరన్ బ్రేవ్.. 84 బంతుల్లో 120 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. బౌలింగ్‌లోనూ రస్సెల్ 5 బంతులేసి ఒక వికెట్ పడగొట్టాడు. ఇలా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మాంచెస్టర్‌కు 68 పరుగుల తేడాతో భారీ విజయం అందించాడు. మరి రస్సెల్ ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: నన్ను బలిపశువును చేయాలని చూస్తున్నారు! ఆండ్రీ రస్సెల్ సంచలన కామెంట్
Andre Russell smashed 64 runs from just 23 balls including 6 fours and 5 Sixes for Manchester Originals in the Hundred league. His strike rate 278.26, What a beast. pic.twitter.com/gDQ6Ie8UWx
— CricketMAN2 (@ImTanujSingh) August 19, 2022