న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్‌లో పస తగ్గిందని.. అతను కెప్టెన్సీ నుంచి తప్పుకుని బ్యాటింగ్‌పై దృష్టి సారించాలంటూ న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ ఆండ్రీ ఆడమ్స్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. న్యూజిలాండ్ టీమ్‌లో విలియమ్సన్ అత్యుత్తమ బ్యాటర్.. అయినా కొంతకాలంగా బ్యాటింగ్‌లో రాణించలేకపోతున్నాడు. పైగా గాయాలతోనూ సతమతం అవుతున్నాడు. ఇన్ని సమస్యల మధ్య అతను కెప్టెన్సీ చేయడం కంటే ఆ బాధ్యతల నుంచి తప్పుకుని పూర్తిగా బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టాని ఆడమ్స్ సూచించాడు.
కేన్ విలియమ్సన్ తన స్థాయికి తగిన ప్రదర్శన చేసి దాదాపు ఏడాది పైనే అయింది. 12 నుంచి 18 నెలలుగా పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్నాడు. ఈ పరిస్థితి వెనుక కుటుంబం, పిల్లల ఎఫెక్ట్ ఎంతో కొంత ఉంటుంది. బాధ్యతలు పెరిగే కొద్ది ఇలాంటి పరిస్థితి సహజం. యువకుడిగా ఉన్నప్పుడు మూడు ఫార్మాట్‌లలో రాణించవచ్చు. కానీ కుటుంబ పెరిగి బాధ్యతలు పెరిగే.. సేమ్ ఫోకస్ ఉండదు. అందుకు కేన్ కెప్టెన్సీతో పాటు ఏదో ఒక ఫార్మాట్‌కు గుడ్ చెప్పి.. ఇతర ఫార్మాట్లపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టడం బెటర్ అని ఆడమ్స్ పేర్కొన్నాడు.
‘నా ఉద్దేశం ప్రకారం.. న్యూజిలాండ్ జట్టుకు కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేసి.. కేన్‌ను బ్యాటింగ్‌పై దృష్టి పెట్టేలా చూడాలి. కేన్ తన కెప్టెన్సీ వదులుకునే విషయంలో ఈగోకు పోకుండా.. మర్యాదగా తప్పుకోవాలి. మాజీ క్రికెటర్ రాస్ టేలర్ కెప్టెన్సీ నుంచి తప్పించనట్లు కేన్ తప్పించే పరిస్థితి తెంచుకునే కంటే అతనే తప్పుకోవడం ఉత్తమం. అలాంటి పరిస్థితి కేన్‌కు రాకూడదు. టేలర్ కెప్టెన్సీ పోయిన తర్వాత బ్యాటర్‌గా అద్భుతంగా రాణించాడు.’ అని ఆడమ్స్ చెప్పాడు. కాగా.. కేన్ విలియమ్సన్ ఫామ్‌లో లేకపోవడం.. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో న్యూజిలాండ్ తొలి రెండు వన్డేల్లో దారుణంగా ఓడిపోవడంతో కెప్టెన్ మార్పుపై కేన్‌పై ఒత్తిడి పెరుగుతున్న మాట వాస్తవం. మరి కేన్ విలియమ్సన్ విషయంలో ఆడమ్స్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్లరూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ఆ డకౌట్ తర్వాత బాతును తినొద్దని ఫిక్స్ అయ్యా: రాస్ టేలర్
The former Kiwi all-rounder Andre Adams believes Kane Williamson is enduring a slump in form, and leaving captaincy in one of the formats can invigorate his career.#AUSvsNZ #KaneWilliamson #AndreAdams pic.twitter.com/X4911zlBsV
— OneCricket (@OneCricketApp) September 11, 2022