భారత మాజీ ఆటగాడు అమిత్ మిశ్రా, పాకిస్తాన్ నటి సెహర్ షిన్వారీ మధ్య ట్విట్టర్ వార్ జరుగుతోంది. ఆసియా కప్ 2022 పోరులో టీమిండియా పోరాటం ముగియడంతో ఈ యుద్ధం మొదలైంది. నిజానికి భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచుల్లోనూ ఈమాత్రం కూడా సమరం జరగలేదు. ఆఖరివరకు ఉత్కంఠభరితంగా సాగినా, సామరస్యక వాతావరణాన్ని చెడగొట్టే ఘటనలేవీ జరగలేదు. మనం కోరుకున్నది కూడా అదే. కానీ, అభిమానులు, మాజీ ఆటగాళ్ల మధ్య గొడవలు ఇప్పట్లో సద్దుమణిగేలా కనపడటం లేదు. అసలు అమిత్ మిశ్రాకు, పాకిస్తాన్ నటి మధ్య గొడవేంటి? ఎందుకు మొదలైంది? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
లీగ్ దశలో పాకిస్తాన్ పై, అలవోకగా విజయం సాధించిన భారత జట్టు.. సూపర్- 4 దశలో మాత్రం చేతులెత్తేసింది. పాకిస్తాన్, శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచుల్లోనూ ఓటమి పాలై సూపర్- 4కు అర్హత సాధించలేకపోయింది. కాకపోతే.. నిన్నటి మ్యాచ్ (పాకిస్తాన్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్) ఫలితం రాక ముందు.. ఇతర జట్ల విజయావకాశాలపై ఆధారపడి కొంచెం ఆశలుండేవి. ఈ మ్యాచులో ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించాలని.. అలా జరిగితే వారం రోజుల పాటు ‘ఆఫ్ఘనీ చాప్'(ఓ రకమైన వంటకం)ని తింటానంటూ అమిత్ మిశ్రా ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. అయితే.. అనూహ్యంగా నసీమ్ షా రెండు సిక్సులు కొట్టి పాకిస్థాన్‌ను గెలిపించడంతో మిశ్రాకు చుక్కెదురయింది. ఈ విషయాన్ని ఉటంకిస్తూ.. పాకిస్థానీ నటి సెహర్ షిన్వారీ కవ్వించే ట్వీట్ చేసింది. “ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్‌ను ఓడించడంలో విఫలమైనందున ఆఫ్ఘన్ చాప్‌కు బదులు ‘ఆవు పేడ’తో అడ్జస్ట్ అవ్వు” అంటూ ట్వీట్లో పేర్కొంది.
Awwww poor mishra will have to spend whole week on Cow Dung 😂
— Sehar Shinwari (@SeharShinwari) September 7, 2022
ఈ సమాధానంపై.. చిర్రెత్తుకొచ్చిన మిశ్రా.. తనదైన స్టయిల్లో ఓ డిఫెరెంట్ సమాధానం పంపాడు. “పాకిస్థాన్‌కు వచ్చే ఆలోచన నాకు లేదంటూ ట్వీట్ చేశాడు. “అంటే.. పాకిస్తాన్ లో మాత్రమే ఆవు పేడ తింటారు. నేను అందుకే రావట్లేను” అని దానర్థం అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. మరి కొద్దిమంది మాత్రం.. “మిశ్రా ఉద్దేశం ప్రకారం.. నేను పాకిస్థాన్‌కు వస్తే నీ పని అయితది అని.. ” అంటూ పోస్టు చేస్తున్నారు.
No, I have no plans of coming to Pakistan. 👍 https://t.co/HbFWeZSjij
— Amit Mishra (@MishiAmit) September 8, 2022
ఈ విషయంపై.. నటి సెహర్ షిన్వారీ మరోసారి స్పందించింది. ‘పాకిస్తాన్‌కు ఎందుకు రావడం..? ఆవు పేడ ఇండియాలో స్టాక్ లేదా?’ అంటూ మరోసారి మిశ్రాను దెప్పిపొడిచేలా ట్వీట్ చేసింది. దీనికి మిశ్రా నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే.. నెటిజన్లు ఇప్పటికే ఈ విషయమై రకరకాలుగా చర్చలు పెట్టేస్తున్నారు. కాగా.. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్‌ను ఓడించడానికి శతవిధాలా ప్రయత్నించింది కానీ.. మ్యాచ్ చివరి ఓవర్‌లో నసీమ్ షా రెండు బ్యాక్ టు బ్యాక్ సిక్స్‌లు బాది పాకిస్థాన్‌ను గెలిపించాడు. వీరిద్దరి గొడవపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Why coming to Pakistan ? Is cow dung out of stock in India ? 🤔 https://t.co/2XCDU3n8L1
— Sehar Shinwari (@SeharShinwari) September 8, 2022