టీమిండియా వెటరన్ ప్లేయర్ అంబటి రాయుడు ఈ సీజన్‌తో ఐపీఎల్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. శనివారం తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా రాయుడు ఈ ప్రకటన చేశాడు. కానీ కొద్ది సేపటికే ఆ ట్వీట్‌ను డిలీట్ చేశాడు. దీంతో రాయుడు మరోసారి తన రిటైర్మెంట్ ప్రకటనను వెనక్కు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే విషయమై చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పందిస్తూ.. రాయుడు రిటైర్ అవ్వడం లేదని, ప్రస్తుతం అతని బ్యాడ్ ఫామ్ వల్ల రాయుడు మానసికంగా ఒత్తిడికి గురై ఇలా ప్రకటన చేశాడని అన్నారు. అతను CSKతోనే ఉంటాడని ఆయన పేర్కొన్నాడు.
గతంలో కూడా రాయుడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి .. తొందరపాటులో నిర్ణయం తీసుకున్నానని చెప్పి రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నాడు. 2019 వన్డే వరల్డ్ కప్ కోసం తనకు టీమిండియాలో స్థానం కల్పించలేదని.. తనను కాదని విజయ్ శంకర్‌ను జట్టులోకి తీసుకున్నారనే కోపంతో రాయుడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటన చేశాడు. కానీ.. తర్వాత తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. ఆ సమయంలో విజయ్ శంకర్‌ను సెలెక్టర్లు త్రీ డైమెన్షన్ ప్లేయర్ అని పేర్కొనడం.. వరల్డ్ కప్ మ్యాచ్‌లు చూసేందుకు త్రీడీ కళ్లాద్దాలు ఆర్డర్ ఇచ్చాడని రాయుడు ట్వీట్టర్లో కౌంటర్ ఇవ్వడం పెను దుమారాన్నే రేపింది.ఇప్పుడు తాజాగా ఐపీఎల్ 2022లో ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయని అంబటి రాయుడు.. ఈ సీజన్ తర్వాత ఐపీఎల్‌కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటన చేసి డిలీట్ చేయడం. ఆ వెంటనే సీఎస్‌కే సీఈఓ వట్టిదే అంటూ ప్రకటన చేయడంతో.. రాయుడు ఎన్ని సార్లు ఇలా తొందరపాటు నిర్ణయాలు తీసుకుని నవ్వుల పాలు అవుతాడని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అంబటి రాయుడు ఇలా కోపంలో నిర్ణయాలు తీసుకుని మళ్లీ మాట మార్చడం సరైంది కాదని అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Ambati Rayudu: రాయుడు.. నీకు ఇంకా ఆశ చావలేదా? ఎందుకయ్యా ఈ పోరాటం?
CSK CEO Kasi Viswanathan has issued a clarification after Ambati Rayudu had announced his retirement from the IPL on Twitter.#IPL2022 #Cricket #CricTracker #CSK #KasiViswanathan #AmbatiRayudu #Retirement #IPL pic.twitter.com/56vtzL0lYT
— CricTracker (@Cricketracker) May 14, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.