క్రికెట్‌లో తమ సత్తా చాటి, దేశానికి ప్రాతినిథ్యం వహించి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన క్రికెటర్లు చాలా మందే ఉన్నారు. వారిలో ప్రముఖంగా చెప్పుకుంటే.. టీమిండియా మాజీ కెప్టెన్ అజహరుద్దీన్, నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ, మనోజ్ తివారి, గౌతమ్ గంభీర్.. తాజాగా హర్భజన్ సింగే క్రికెట్ కెరీర్ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి మంచి పదవులే అధిరోహించారు. అందులో అజహరుద్దీన్ తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్నారు. గతంలో ఎంపీగా పని చేశారు. పంజాబ్‌లో సిద్దూ కాంగ్రెస్ పీసీసీ చీఫీగా ఉన్నారు. అలాగే పశ్చిమ బెంగాల్‌లో మనోజ్ తివారీ మమత పార్టీ తృణముల్ కాంగ్రెస్‌లో చేరి ఏకంగా క్రీడా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గంభీర్ బీజేపీ నుంచి ఎంపీగా ఉన్నాడు. హర్భజన్ సింగ్ కూడా త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నాడు. ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా రాజ్యసభకు వెళ్లనున్నాడు భజ్జీ.
కాగా ఆంధ్రప్రదేశ్ నుంచి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించి.. ఐపీఎల్‌తో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న క్రికెటర్ అంబటి రాయుడు కూడా త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు విశ్వసనీయ సమాచారం. వారం రోజుల క్రితమే ఆయన రాజకీయ రంగ ప్రవేశంపై అనేక వార్తలు వచ్చాయి. తాజాగా ఆయన జనసేన పార్టీలో చేరనున్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని బలపరుస్తూ రాజకీయ నిపుణులు కూడా వారి అభిప్రాయాలను వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన రాయుడు.. పొలిటికల్ ఎంట్రీ కూడా ఆ జిల్లా నుంచే ఉండే అవకాశం ఉంది. ఏపీలో ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా.. గుంటూరులో మాత్రం తెలుగుదేశం పార్టీకి మంచి బలం ఉంది. అక్కడ టీడీపీకి బలమైన క్యాడర్, నాయకత్వం ఉంది. అలాగే అధికార పార్టీ వైసీపీకి కూడా బలమైన నేతలు ఉన్నారు. దీంతో రాజకీయంగా తాను ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నయంగా ఉండాలంటే కచ్చితంగా మూడో పార్టీ నుంచే ఉండాలని రాయుడు భావిస్తున్నట్లు సమాచారం. అలాగే సామాజిక వర్గ పరంగా చూసుకున్నా కూడా రాయుడు జనసేన వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. ఏపీ రాజకీయాల్లో సామాజిక సమీకరణాలు ఎంతో ప్రభావం చూపిస్తాయి. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని రాయుడు జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. గుంటూరులో జనసేన క్యాడర్ కూడా రాయుడు రాకను స్వాగతిస్తున్నట్లు తెలుస్తుంది.
ఇదీ చదవండి: భారత క్రికెటర్లపై రవిశాస్త్రి వివాదాస్పద వ్యాఖ్యలు
క్రికెట్ కెరీర్ అనంతరం రాజకీయంగా ఎదిగేందుకు జనసేన రాయుడికి బెస్ట్ ప్లాట్ ఫామ్ అవుతుందని పొలిటికల్ పండితులు సైతం బలంగా చెప్తున్నారు. కాగా ప్రస్తుతానికి తన ఫోకస్ మొత్తం ఐపీఎల్‌పై పెట్టిన రాయుడు.. శనివారం నుంచి ప్రారంభం కానున్న మెగా లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున బరిలోకి దిగనున్నాడు. ఈ సీజన్ వరకు క్రికెట్‌పై దృష్టి పెట్టి.. ఆ తర్వాత రాజకీయ ఆరంగేట్రం చేసి.. 2024 అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచేందుకు రాయుడు సిద్ధం కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. అలాగే ఇప్పటికే జనసేన అధినాయకత్వంతో రాయుడు టచ్‌లో ఉన్నట్లు తెలుస్తుంది. కాగా పూర్తి చర్చల తర్వాతనే రాయుడు ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీ చేసే విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ శాతం ఎంపీగా పోటీ చేసేందుకే రాయుడు ఆలోచిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెప్పుకుంటున్నారు. మరి అంబటి రాయుడు జనసేనలో చేరితే.. రాజకీయంగా రాయుడు భవిష్యత్తుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: పంజాబ్ టీమ్ నుంచి బయటికి రావడంపై నోరు విప్పిన కేఎల్ రాహుల్
Just @RayuduAmbati things🔥🔥🔥#CSK𓃬 | #Ambatirayudu | #TATAIPL2022 pic.twitter.com/LTRwBuTJc2
— Team CSK (@teamCSKforever) March 22, 2022
డబ్బుల కోసం ప్రజలను పీడిస్తున్న ప్రభుత్వం – JanaSena Party PAC Chairman Shri @mnadendla pic.twitter.com/wFiB0eL3mY
— JanaSena Party (@JanaSenaParty) March 21, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.