టీమిండియా మాజీ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్ మన్ అంబటి రాయుడు.. ఈ ఐపీఎల్ సీజన్‌లో అంతంత మాత్రంగానే రాణిస్తున్నాడు. గతంలో ముంబయి ఇండియన్స్‌కు ఆడిన ఈ తెలుగు కుర్రాడు.. ప్రస్తుతం చెన్నై జట్టు తరుపున బరిలోకి దిగుతున్నాడు. ఆట తీరు ఎలా ఉన్నా ఇప్పుడు ఫుల్ ఖుషీలో ఉన్నాడు రాయుడు.
టీమిండియా మాజీ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్ మన్ అంబటి రాయుడు.. ఈ ఐపీఎల్ సీజన్‌లో అంతంత మాత్రంగానే రాణిస్తున్నాడు. గతంలో ముంబయి ఇండియన్స్‌కు ఆడిన ఈ తెలుగు కుర్రాడు.. ప్రస్తుతం చెన్నై జట్టు తరుపున బరిలోకి దిగుతున్నాడు. గత ఆట తీరుతో పోలిస్తే.. ఈ ఐపీఎల్ లో అత్యంత పేలవమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఒకప్పుడు ఓడిపోతున్న అనేక మ్యాచ్ లను గెలిపించిన అతడు.. ఈ ఐపీఎల్‌లో తన ఆటతీరుతో అపవాదులు మూటగట్టుకుంటున్నాడు. ఈ సీజన్ ముగిసిన తర్వాత పొలిటికల్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వైసీపీలోకి రానున్నట్లు సమాచారం. ఆట తీరు ఎలా ఉన్నా ఇప్పుడు ఫుల్ ఖుషీలో ఉన్నాడు అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ అంబటి రాయుడు మరోసారి తండ్రి అయ్యాడు. రాయుడు, విద్య దంపతులకు పండంటి ఆడబిడ్డ పుట్టింది. తనకు కుమార్తె పుట్టిన విషయాన్ని అంబటి రాయుడు సోసల్ మీడియా వేదికగా వెల్లడించాడు. తన కూతురు ఫోటోను షేర్ చేశాడు. తన మొదటి కుమార్తె, ఇప్పుడు పుట్టిన కుమార్తె కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసిన ఈ స్టార్ క్రికెటర్.. ‘కూతుళ్లు నిజంగా మనకు దక్కే ఆశీర్వాదాలు’ అని పోస్టు పెట్టాడు.అంబటి రాయుడు తన స్నేహితురాలు చెన్నుపల్లి విద్యను 2009 ఫిబ్రవరి 14 న వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు 2020లో ఆడపిల్ల పుట్టింది. తాజాగా వీరూ మరో పాపకు జన్మనిచ్చారు.
ఈ పోస్టును చెన్నై సూపర్ కింగ్స్ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. దీనికి మరో అందమైన క్యాప్షన్‌ను జోడించింది. ‘సూపర్ డ్యాడ్‌కు రెట్టింపు ఆనందం. రాయుడు, అతని కుటుంబానికి శుభాకాంక్షలు’ అని పేర్కొంది. దీనిపై మరో క్రీడాకారుడు, రాయుడు టీంమేట్ శివమ్ దూబే స్పందించాడు. ‘భయ్యాకు, అతని కుటుంబానికి కంగ్రాచ్యులేషన్స్’ అని పోస్టు పెట్టాడు. ఐపీఎల్ 2023లో అంబటి రాయుడు 12 మ్యాచులు ఆడి 122 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేటు కూడా 127 మాత్రమే ఉండటం గమనార్హం.