టెస్ట్ క్రికెట్ విరాట్ కోహ్లీ వలనే సజీవంగా ఉంది: ఆసీస్ దిగ్గజం ప్రశంసలు

యాషెస్, డబ్ల్యూటీసీ ఫైనల్ మినహాయిస్తే టెస్టులకి పెద్దగా క్రేజ్ లేని మాట వాస్తవం. అయితే కొంతమంది ఆటగాళ్లకి విపరీతమైన ఫాలోయింగ్ ఉండడడం వలన టెస్టు క్రికెట్ ఇంకా కొనసాగుతుంది. ఈ విషయం గురించి ఆసీస్ దిగ్గజం అలెన్ బోర్డర్ మాట్లాడుతూ.. కోహ్లీ మీద ప్రశంసలు కురిపించాడు.

ప్రస్తుతం టెస్టు క్రికెట్ కి అంతగా క్రేజ్ లేకపోయినా.. ఈ ఫార్మాట్ అంటే చాలా మంది దిగ్గజాలకు అపారమైన గౌరవం ఉంది. ఈ జనరేషన్ లో క్రికెటర్లు ఈ ఫార్మాట్ మీద అంతగా ఆసక్తి చూపించలేకపోవడం వలన క్రమంగా ఆదరణ తగ్గిపోతుంది. వన్డే క్రికెట్, ముఖ్యంగా టీ 20 వచ్చిన తర్వాత టెస్టు క్రికెట్ ని పట్టించుకునేవారు కరువయ్యారు. ఈ క్రమంలో ప్రపంచంలో ఎన్నో టీ 20 లీగ్ లు టెస్ట్ క్రికెట్ ని మరింతగా వెనక్కి తీసుకెళ్లాయి. ఈ నేపథ్యంలో ఈ ఫార్మాట్ కి మళ్ళీ పునర్వైభవం తీసుకురావాలనే ఆలోచనతో డబ్ల్యూటీసీ ఫైనల్ ని తీసుకొచ్చారు. అయినా అంతంత మాత్రంగానే టెస్టు క్రికెట్ కొనసాగుతుంది. ఈ విషయం గురించి ఆసీస్ దిగ్గజం అలెన్ బోర్డర్ మాట్లాడుతూ.. కోహ్లీ మీద ప్రశంసలు కురిపించాడు.

యాషెస్, డబ్ల్యూటీసీ ఫైనల్ మినహాయిస్తే టెస్టులకి పెద్దగా క్రేజ్ లేని మాట వాస్తవం. అయితే కొంతమంది ఆటగాళ్లకి విపరీతమైన ఫాలోయింగ్ ఉండడడం వలన టెస్టు క్రికెట్ ఇంకా కొనసాగుతుంది. ఇంతటి పాపులారిటీ కారణంగానే ఫార్మాట్ తో సంబంధం లేకుండా.. తమ ఫేవరేట్ ప్లేయర్ గ్రౌండ్ లోకి అడుగుపెడితే ఫ్యాన్స్ టెస్టు క్రికెట్ అయినా.. ఎగబడి చూస్తారు. భారత్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఈ లిస్టులో ప్రధమ వరుసలో నిలుస్తాడు. కోహ్లీ ఆడాలే గానీ ఫార్మాట్ తో పని లేకుండా స్టేడియం నిండిపోతుంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు కోహ్లీ పాపులారిటీ చూసి అలెన్ బోర్డర్ సైతం ఫిదా అయ్యాడు. కోహ్లీ గురించి వ్యాఖ్యానిస్తూ “టెస్టు క్రికెట్ ఇంకా కోహ్లీ లాంటి ప్లేయర్ల వలనే సజీవంగా మిగిలి ఉంది”. అని కింగ్ మీద ప్రశంసల వర్షం కురిపించాడు.

బోర్డర్ ఆస్ట్రేలియా అల్ టైం టాప్ బ్యాటర్లలో ఒకడు. ఈ లెజెండరీ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా 1987 లో వన్డే వరల్డ్ కప్ గెలిచింది. ఇతని పేరు మీదే బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీ కూడా ఉంది. టెస్టుల్లో 11000 పైగా పరుగులు చేసి అప్పట్లో అల్ టైం రికార్డ్ సృష్టించాడు. ప్రస్తుతం భారత్ ఆసీస్ తో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడబోతుంది. ఈ నెల 7 న జరిగే ఈ ఫైనల్ కి లండన్ లోని ఓవల్ లో మైదానం ఆతిధ్యమిస్తుంది.ఇందులో భాగంగా కోహ్లీ గురించి బోర్డర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మొత్తానికి ఆస్ట్రేలియా దిగ్గజం నుండి మన కింగ్ కోహ్లీ ప్రశంసలు అన్నదుకోవడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్లు రూపంలో తెలపండి.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Most viewed