పవర్ హిట్టింగ్ చేయడంలో విండీస్ ప్లేయర్లను మించినవారు ఉండరు. ఎన్నో ఏళ్లుగా వీరి జట్టులో నిలకడగా ఆడేవారు తక్కువ మంది ఉన్నప్పటికీ బంతిని బలంగా బాదడంలో వీరి తర్వాతే ఎవరైనా అంటే ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. డెబ్యూ మ్యాచులోనే పవర్ హిట్టింగ్ తో ఏకంగా ప్రపంచ రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.
వెస్టిండీస్-యూఏఈల మధ్య జరుగుతన్న మూడు వన్డే మ్యాచుల సిరీస్ లో విండీస్ 3-0 తో క్లీన్ స్వీప్ చేసింది. పసికూనలపై చెలరేగిపోతూ విశ్వరూపం చూపిస్తుంది. ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన యూఏఈ 184 పరుగులకే ఆలౌటైంది. యూఏఈ జట్టులో అరవింద్ 70 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా .. కెప్టెన్ వసీం 42 పరుగులతో రాణించాడు. ఇక ఛేదనలో విండీస్ కి మెరుపు ఆరంభం దక్కినా.. మిడిల్ ఆర్డర్ విఫలం కావడంతో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఇక ఈ మ్యాచ్ ద్వారా విండీస్ ఓపెనర్ అలిక్ అథనేజ్ డెబ్యూ మ్యాచులోనే ఒక ప్రపంచ రికార్డ్ నెలకొల్పాడు.
పవర్ హిట్టింగ్ చేయడంలో విండీస్ ప్లేయర్లను మించినవారు ఉండరు. ఎన్నో ఏళ్లుగా వీరి జట్టులో నిలకడగా ఆడేవారు తక్కువ మంది ఉన్నప్పటికీ బంతిని బలంగా బాదడంలో వీరి తర్వాతే ఎవరైనా అంటే ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. తాజాగా అలాంటి లిస్టులోకి మరో పవర్ హిట్టర్ చేరిపోయాడు. వన్డే అరంగేట్రం మ్యాచ్‌లో అలిక్ అథనేజ్ రికార్డు క్రియేట్ చేశాడు. ఈ మ్యాచులో 45 బంతుల్లో 65 పరుగులు చేసిన ఈ బ్యాటర్..24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసాడు. ఈ క్రమంలో డెబ్యూ మ్యాచులోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్ గా నిలిచాడు.
గతంలో భారత బ్యాటర్ కృనాల్ పాండ్యా పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. వన్డే అరంగేట్రం మ్యాచ్‌లో కేవలం 24 బంతుల్లోనే ఆ ఇద్దరూ హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. అతని ఇన్నింగ్స్‌లో 9 బౌండరీలు, మూడు సిక్సర్లు ఉన్నాయి. బ్రియాన్ లారాకు అభిమాని అయిన అథనేజ్.. మాజీ విండీస్ దిగ్గజం స్టయిల్‌లోనే బ్యాటింగ్ చేస్తున్నాడు. స్టయిలిష్ స్ట్రోక్ ప్లేతో ఆకట్టుకున్నాడు. మరి తొలి మ్యాచులోనే అదరగొట్టిన అథనేజ్..ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తాడో చూడాలి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
🚨WORLD RECORD🚨
Alick Athanaze has equaled the fastest half-century on ODI debut!🤯#MenInMaroon #UAEvWI pic.twitter.com/MqlgaLTSd5
— Windies Cricket (@windiescricket) June 9, 2023