టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు అదిరిపోయే సమాధానం చెప్పింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దర్లో మీ ఎవరంటే ఇష్టం అని యాంకర్ అడగ్గా.. ప్రస్తుతం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆల్‌టైమ్ ఫెవరేట్ అంటూ తెలివిగా సమాధానం ఇచ్చింది. అలాగే నువ్వు విరాట్ కోహ్లీ లాగా నిద్రలేస్త ఏం చేస్తావ్ అంటే.. బ్రేక్ తీసుకుంటా, ఇప్పటికే కోహ్లీ చాలా కష్టపడ్డాడు అని చెప్పింది. అలాగే రోహిత్ శర్మలా అయితే.. అసలు బ్రేక్ తీసుకోను, ఇప్పుడేకదా కెప్టెన్సీ వచ్చింది.. అంటూ నవ్వేసింది. కాగా ప్రస్తుతం ఆలియా ఆన్సర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆలియా భట్ ముఖ్య పాత్రలో వచ్చిన గంగుబాయి సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తన అద్భుత నటనపై సినీ ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే ఆలియా పాన్ ఇండియా మూవీ.. ఆర్‌ఆర్‌ఆర్‌లో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ సరసన నటిస్తున్న విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ముఖ్య పాత్రల్లో రానున్న ఆర్‌ఆర్‌ఆర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. కోవిడ్ కారణంగా వాయిదా పడ్డ ఆ సినిమా మార్చి 25వ తేదీ విడుదలకు సిద్ధమైనట్లు సమాచారం. మరి ఆలియా భట్ విరాట్ కోహ్లీపై చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Alia Bhatt’s current favourite is Rohit Sharma but Virat Kohli is… #AliaBhatt #CricketTwitter pic.twitter.com/CxU5uRMfGx
— Sushant Mehta (@SushantNMehta) February 23, 2022